విజయ్ సేతుపతి హీరోగా డైరెక్ట్ తెలుగు సినిమా ప్లాన్ చేస్తున్న మైత్రీ

కోలీవుడ్ లో మక్కల్ సెల్వన్ గా అభిమానులతో పిలిపించుకునే నటుడు విజయ్ సేతుపతి.అతి తక్కువ సమయంలోనే నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడుగా సేతుపతి ఉన్నాడు.

 Vijay Sethupathi Straight Telugu Movie With Mythri Movie Makers, Tollywood, Uppe-TeluguStop.com

పిజ్జా సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస ఛాన్స్ లు అందుకుంటూ దూసుకుపోయాడు.నటుడుగా సినిమా సినిమాకి తనలో వేరియేషన్స్ చూపిస్తూ, తనని తాను మెరుగు పరుచుకుంటూ విజయ్ సేతుపతి ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు.

అప్పుడప్పుడు విజయ్ సేతుపతి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పలకరిస్తూనే ఉన్నాడు.అయితే సైరా సినిమాలో కీలక పాత్రతో స్ట్రైట్ తెలుగు సినిమా చేశాడు.

ఈ మూవీలో అతని నటనకి మంచి ప్రశంసలు లభించాయి.దాంతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో హీరోయిన్ తండ్రిగా ఒదిగిపోయి నటించాడు.

ఆ పాత్రలో విజయ్ సేతుపతి తప్ప మరెవ్వరు సెట్ కారనే విధంగా నటించాడు.విజయ్ కారణంగా ఉప్పెన సినిమాకి మరింత క్రేజ్ వచ్చింది.ఇక మాతృభాషలో కూడా ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు విలన్ గా కూడా నటించి మెప్పిస్తున్నాడు.ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి త్వరలో స్ట్రైట్ తెలుగు సినిమాలో హీరోగా నటించే అవకాశం కనిపిస్తుంది.

ఉప్పెన సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ విజయ్ తో స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి అతనికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే ఈ మూవీ ఎవరి దర్శకత్వంలో ఉంటుంది, ఎలాంటి కథతో సినిమా చేస్తాడు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube