అమెరికా: వాటే ఐడియా సర్ జీ.. వ్యాక్సినేషన్‌‌పై ప్రచారానికి డేటింగ్‌ యాప్‌లు

ప్రపంచాన్ని పెను విషాదంలోకి నెట్టిన కోవిడ్ వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూశారు.నిద్రాహారాలు మాని, రాత్రిపగలు శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రతిఫలంగా కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది.

 Joe Biden Govt Using Dating Apps Also For Vaccinating More American Youth Full-TeluguStop.com

పలుదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి కూడా.ఇంత జరుగుతున్నా ప్రజల్లో ఏదో భయం, ఏదో అనుమానం.

టీకా తీసుకోవడం మంచిదేనా, ఏమైనా దుష్పరిణామాలు వస్తే పరిస్ధితేంటీ అన్న ఆందోళన పలువురిని వెంటాడుతోంది.అయితే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశాధినేతలు, సెలబ్రెటీలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి.

ఇక ప్రపంచంలోనే కరోనా ఉద్ధృతంగా వున్న అమెరికాలో అక్కడి ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది.అధికారంలోకి వస్తూనే కరోనా అంతమే తన మొదటి లక్ష్యయమన్నారు జో బైడెన్.

అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.

మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.దీంతో బైడెన్‌ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.

దాన్ని కూడా 10 రోజుల ముందే.అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.

ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.కానీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, జూలై 4 నాటికి దేశాన్ని కరోనా ఫ్రీగా చేయాలని బైడెన్ కంకణం కట్టుకున్నారు.

Telugu Biden, App, Heads-Telugu NRI

అయినప్పటికీ పలువురు అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకోకుండా మొహం చాటేస్తున్నారు.కొన్ని రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ స్థాయిల్లో కూడా తగ్గింపు కనిపిస్తోంది.ముఖ్యంగా యువత టీకా తీసుకునేందుకు అంతగా ఆసక్తి కనబరచడం లేదు.ఈ క్రమంలో మళ్లీ యువత అడుగులు వ్యాక్సిన్లవైపు పడేలా చేయడం కోసం అమెరికా ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది అదే డేటింగ్ యాప్.

అమెరికాలోని యువకుల్లో 50శాతం మంది ఏదో ఒక డేటింగ్ యాప్‌లో ఖాతాదారులే.దీనిని బట్టి అక్కడ ఆన్‌లైన్ డేటింగ్‌కి రెస్పాన్స్ ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.వ్యాక్సినేషన్‌కు ప్రచారం కల్పించేందుకు అగ్రరాజ్యం ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల సహకారం తీసుకుంటోంది.దీనిలో భాగంగా అమెరికాలోని కొన్ని డేటింగ్ యాప్‌లు ఇప్పటికే కొత్త ఫీచర్ తీసుకొచ్చాయి.

ఈ యాప్‌లో కనిపించే వ్యక్తుల ప్రోఫైల్‌లో వ్యక్తుల వివరాలతోపాటు, వాళ్లు వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా అనే విషయం తెలిపే ఒక బ్యాడ్జి కూడా కనిపిస్తుంది.ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయానికి టిండ్, బంబుల్, హింజె, మార్చ్, ఓకే క్యూపిడ్ తదితర కంపెనీలన్నీ మద్ధతు తెలిపాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube