మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత ఏడాది సంక్రాంతికి అల్లు అర్జున్ తో తెరకెక్కించిన అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.
రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న అల వైకుంఠ పురంలో సినిమా తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో సినిమా ను త్రివిక్రమ్ మొదలు పెట్టాలనుకున్నాడు.కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆలస్యం అవుతూనే ఉండటంతో ఏకంగా ఏడాదికి పైగానే త్రివిక్రమ్ సమయం వృదా అయ్యింది.
దాంతో చేసేది లేక మహేష్ బాబుతో సినిమాను చేసేందుకు త్రివిక్రమ్ కమిట్ అయిన విషయం తెల్సిందే.మరీ ఆలస్యం చేయకుండా వెంటనే షూటింట్ కు త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఒక వైపు సర్కారు వారి పాట సినిమా ను చేస్తూనే మరో వైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జులై లో సినిమా పట్టాలెక్కబోతుంది.
వచ్చే సమ్మర్ లో సినిమా రాబోతుంది.మహేష్ బాబుతో సినిమా ను కన్ఫర్మ్ చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ ఇదే సమయంలో తదుపరి సినిమా కూడా కన్ఫర్మ్ చేయాలని అభిమానులు ఆశ పడుతున్నారు.
కాని పరిస్థితులు చూస్తుంటే ఆయనకు అనుకూలంగా లేవు.ఎన్టీఆర్ తో సినిమాకు ఇప్పట్లో చాన్స్ లేదు.
ఆర్ ఆర్ ఆర్ పూర్తి అయిన తర్వాత కొరటాల శివ తో ఒక సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నాడు.ఇతర హీరోలు అంతా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు.
రాబోయే రెండేళ్ల వరకు ఖాళీ లేరు.దాంతో త్రివిక్రమ్ మహేష్ బాబు తర్వాత కనీసం మళ్లీ ఏడాది పాటైన వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.
మొత్తానికి త్రివిక్రమ్ నెక్ట్స్ ఏంటీ కన్ఫర్మ్ అవ్వలేదు.