తెలంగాణ రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.లాక్ డౌన్ ప్రకటన ఎప్పుడైతే వెలువడిందో అనగా మే 11 వ తారీకు మధ్యాహ్నం నుండే మందుబాబులు మద్యం షాపుల వద్ద భారీగా గుమిగూడారు.
దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా మూడు రోజుల్లో లిక్కర్ ద్వారా 400 కోట్లు ఎక్సైజ్ శాఖకు మందు బాబులు గిఫ్ట్ ఇచ్చినట్లయింది.ఒకవైపు కరోనా విలయతాండవం మరోవైపు లాక్ డౌన్ ఉన్న మందుబాబులు యదేచ్ఛగా రెచ్చిపోతున్నారు.
లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన కొద్ది గంటల్లోనే భారీగా మందుబాబులు మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఉన్న కొద్ది టైమ్ లోనే బాటిల్ మీద బాటిల్ లు . స్టాక్ ఇంట్లో ఉండేలా కొనుక్కుని వెళ్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించగానే.
తెలంగాణ రాష్ట్రంలో ముందుగా అలర్ట్ అయింది మందుబాబులు.ఆరోజు మధ్యాహ్నం నుండే వైన్ షాపుల వద్ద భారీగా క్యూలు కట్టి కొనుగోలు చేయటం స్టార్ట్ చేశారు.
దీంతో ఈ మూడు రోజులకు దాదాపు మద్యం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 400 కోట్లు వచ్చినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.మరోపక్క సామాన్య జనులు మద్యం షాపుల వద్ద అంత భారీగా జనాలు గుమిగూడాటం వాళ్ళ కరోనా ఇతరులకు సోకదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
మద్యం షాపులు కూడా క్లోజ్ చేయాలని కోరుతున్నారు.