ప్రస్తుతం భారత దేశంలో కోవిడ్ చేస్తున్న విలయ తాండవానికి ప్రపంచ దేశాల చూపు ఇండియా పై పడింది.ఈ దశలో ఒక్కో దేశం మన దేశానికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు.
ఇకపోతే ప్రస్తుత దశలో ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి అతి తీవ్ర స్దాయిలో ఉందన్న విషయం అందరికి తెలిసిందే.ఈ క్రమం లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా ఉదృతి ఇలాగే కొనసాగుతూ, దీని రేటు వారంలో 10 శాతం దాటితే మినీ లాక్ డౌన్ ప్రకటించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.
అదీగాక వివాహాలకు 50 మంది, అంత్య క్రియలకు 20 మందికే అనుమతి ఇవ్వాలని, 50 శాతంతోనే బస్సులు, రైళ్లు నడపాలని ఆదేశాలు ఇస్తూనే, ఐసీయూ పడకల భర్తీ 60 శాతం మించిన ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్‌లు ప్రకటించాలని పేర్కొన్నది.
కాగా దేశంలో కరోనా విలయతాడవం చేస్తున్న నేపధ్యం లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వెల్లడించిదట.