రెండు తెలుగు రాష్ట్రాలకు చాలావరకు ఆక్సిజన్ సరఫరా తమిళనాడు, ఒడిషా మరికొన్ని రాష్ట్రాలు నుండి వస్తోంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కేసులు ఉన్న కొద్ది పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానికి లేఖ రాశారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు తమిళనాడు నుండి సరఫరా అవుతున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిలిపివేయాలని కేంద్రాన్ని లెటర్లో కోరారు.రాష్ట్రంలో కేసులు పెరిగిపోతుండటంతో.
తమిళనాడులో ఆక్సిజన్ కొరకు ఏర్పడకుండా, వినియోగించుకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితి బట్టి రాబోయే రోజుల్లో మరింత అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని.తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రం నుండి సప్లై అవుతున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలను ఆపివేయాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 310 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని కానీ 220 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెరంబదూర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు సప్లై అవుతున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని వెంటనే నిలిపివేయాలని ప్రధాని మోడీ కి తమిళనాడు సీఎం పళని స్వామి లెటర్ రాశారు.