కలియుగాంతం గురించి చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు వింటూనే ఉన్నాము.యుగాంతం గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.
యుగాంతం గురించి సినిమాలు, పుస్తకాలలో కూడా ప్రస్తావించారు.కానీ లయకారకుడైన ఆ పరమేశ్వరుడు ఆజ్ఞమేరకు యుగాంతం జరుగుతుందని, కలియుగం అంతం తర్వాత ఈ భూమిపై ఒక్క ప్రాణి కూడా నివసించవని ఎన్నో పురాణాలలో తెలియజేయడమైనది.
భారత పురాణాలను బట్టి ప్రపంచాన్ని నాలుగు యుగాలుగా విభజించారు.
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం.
ప్రస్తుతం మనం నివసిస్తున్నది కలియుగంలో.ఇప్పటివరకు గత మూడు యుగాలు ఒక భయంకరమైన ప్రళయం సంభవించి అంతమయ్యాయి.
అదేవిధంగా నాలుగవ యుగం కలియుగం కూడా ఇలాంటి ప్రళయం సంభవించి అంతమైపోతుందని పురాణాలు చెబుతున్నాయి.ఈ క్రమంలోనే మన దేశంలో కొన్ని ఆలయాలలో యుగాంతం తెలిపే సంకేతాలు ఉన్నాయి అందులో ఒకటే ఈ కేదారేశ్వర ఆలయం.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలో నాలుగు స్తంభాల మీద పెద్ద బండరాయి, దాని కింద 12 అడుగుల శివలింగం రూపంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు.ఈ ఆలయంలో వున్న శివ లింగాన్ని భూమి మీద నుంచి ఆరడుగుల ఎత్తులో నిర్మించారు.ఈ ఆలయంలో నిర్మించిన నాలుగు స్తంభాలు నాలుగు యుగాలకు ప్రతీకగా భావిస్తారు.
ఈ ఆలయంలో ఉన్న స్తంభం యుగాంతానికి 24 గంటల ముందు విరుగుతుంది.ఈ స్తంభం విరిగిన రోజే ఆ యుగానికి చివరి రోజు అని అక్కడి ప్రజలు భావిస్తారు.
ఇప్పటి వరకు ఈ ఆలయంలో ఉన్న మూడు స్తంభాలు విరిగిపోయి కేవలం ఒక స్తంభం మాత్రమే అంత పెద్ద రాతి బండ బరువును మొస్తుంది.ఈ స్తంభం అంత బరువు ఎలా మోస్తుంది అనే విషయం ఎవరికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది.
ఈ ఆలయంలో ఉన్న స్తంభం ఎప్పుడైతే విరుగుతుందో దానికి అదే చివరి రోజనే సంకేతాలను తెలియజేస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.