ఆస్కార్ బరిలో ది వైట్ టైగర్... ఇండియా నుంచి మొదటి సారి

ఇండియన్ సినిమాలు ఆస్కార్ కి నామినేట్ అవ్వడమే ఎక్కువ.అలాంటిది ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం అంటే కల అని చెప్పాలి.

 The White Tiger Movie In Oscar Race, Hollywood, Priyanka Chopra, ‎adarsh Goura-TeluguStop.com

ఇండియన్ దర్శకులు తెరకెక్కించిన ఏ ఒక్క సినిమా కూడా ఆస్కార్ అవార్డులు గెలుచుకోలేదు.కాని ఇండియన్ బ్యాక్ డ్రాప్ కథలతో తెరకెక్కించిన హాలీవుడ్ సినిమాలు మాత్రం అవార్డులు గెలుచుకున్నాయి.

మొదటిసారి గాంధీ సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి.ఈ సినిమాలో ఇండియన్ బ్యాగ్రౌండ్ ఉన్న అమెరికన్ యాక్టర్ గాంధీజీ పాత్రలో నటించారు ఆ తరువాత బెంగాల్ మురికివాడల నేపధ్యంలో జరిగే స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాకి అత్యధికంగా ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

ఈ సినిమాలో నటించిన భారతీయ నటులు తరువాత హాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు.అయితే ఈ రెండు సినిమాలు హాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాల ద్వారా ఇండియన్ టెక్నిషియన్స్ ని ఆస్కార్ అవార్డులు రావడం విశేషం.గాంధీ సినిమాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు రాగా, స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా అలాగే సౌండ్ మిక్సింగ్ కోసం రసూల్ పోకుట్టికి ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

వీటి తర్వాత ఆస్కార్ బరిలో పోటీ పడుతున్న మరో ఇండియన్ మూవీ ది వైట్ టైగర్.ఈ సినిమా అరవింద్ అడిగ రాసిన పుస్తకం ఆధారంగా హాలీవుడ్ లో తెరకెక్కించారు.

ప్రియాంకా చోప్రా, రాజ్ కుమార్ రావ్ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.అలాగే ఆదర్శ్ గౌరవ్ అనే యాక్టర్ కూడా పరిచయం అయ్యాడు.

ఇతని నటనకి మంచి ప్రశంసలు లభించాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండియా నుంచి ఆస్కార్ బరిలో ఈ సినిమా పోటీ పడుతూ ఉండటం, ఇప్పటికే హాలీవుడ్ లో మంచి హిట్ టాక్ తెచ్చుకొని విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకోవడంతో కచ్చితంగా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులు ఏదో ఒక విభాగంలో వస్తాయనే నమ్మకం ఉంది.

ఈ నెల 26న జరగబోయే ఈ ఆస్కార్ వేడుకలలో ది వైట్ టైగర్ న్యాయ నిర్ణేతలకి ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube