అల వైకుంఠ పురంలో సినిమా మ్యూజిక్ ఆల్బం ఇప్పటికే యూట్యూబ్ లో బిలియన్ మార్క్ ను క్రాస్ చేసి సౌత్ ఇండియాలో సూపర్ హిట్ ఆల్బం గా నిలిచిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠ పురంలో సినిమా గత ఏడాది సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.
ఆ సినిమా సక్సెస్ లో పాటల ప్రాముఖ్యత చాలా ఉంది.అల వైకుంఠ పురంలోని బుట్ట బొమ్మ పాట సూపర్ డూపర్ సక్సెస్ ను దక్కించుకుంది.
ఆ పాట మరో లెవల్ లో ఉందంటూ కామెంట్స్ వచ్చాయి.అంతర్జాతీయ స్థాయిలో పాటకు పాపులారిటీ దక్కింది.
కనుక ఖచ్చితంగా అల వైకుంఠపురంలో సినిమా హిట్ అవుతుందని ముందే అనుకున్నారు.అన్నట్లుగానే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
సినిమా వచ్చిన తర్వాత కూడా పాటల జోరు కంటిన్యూ అయ్యింది.థమన్ సంగీతం అందించిన ఈ పాటల ఆల్బమ్ ఏకంగా రెండు బిలియన్ ల వ్యూస్ ను యూట్యూబ్ లో దక్కించుకుంది.
యూట్యూబ్ వీడియో లు మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడం చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం.చాలా అరుదుగా మాత్రమే బిలియన్ వ్యూస్ ను రాబట్టడం జరుగుతుంది.
అల వైకుంఠపురంలో సినిమా పాటల ఆల్బం మొత్తం కలిపి ఇప్పటికే రెండు బిలియన్ లను మించి వ్యూస్ ను రాబట్టింది.ఏడాది లోపులో ఒక బిలియన్ వ్యూస్ ను రాబట్టి రెండవ బిలియన్ ను అతి తక్కువ సమయంలో దక్కించుకున్న అల వైకుంఠ పురంలో సినిమా అద్బుతం అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పాటలు ఇంకా కూడా యూట్యూబ్ చార్ట్ బస్టర్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.ఏడాదిన్నరగా ట్రెండ్ అవుతున్న పాటలు ఇవే అనడంలో సందేహం లేదు.
ఈ లెక్కన దూసుకు పోతే మూడు బిలియన్ ల వరకు కూడా వ్యూస్ రాబట్టే అవకాశం ఉందంటున్నారు.