సౌత్ లో ఇదైనా ఒక హిట్ మూవీ వచ్చింది అంటే దానిపై వెంటనే బాలీవుడ్ కండల వీరుడు కన్ను పడుతుంది.ఆ సినిమాని వెంటనే హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తాడు.
ఇలా గత కొన్నేళ్ళ నుంచి తెలుగులో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలని సల్మాన్ ఖాన్ రీమేక్ చేసి వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.పోకిరి, రెడీ లాంటి సినిమాలతో కమర్షియల్ సక్సెస్ లు అందుకోవడంతో హీరోయిక్ కథల వైపు సల్మాన్ దృష్టి సారించి సౌత్ స్టైల్ లో యాక్షన్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉండే కథలని సిద్ధం చేయాలని బాలీవుడ్ దర్శకులకి చెబుతున్నాడు.
అలాంటి కథలతో వచ్చే వారికి అవకాశం ఇస్తున్నాడు.ఈ నేపధ్యంలో సల్మాన్ ఖాన్ సినిమా అంటే సౌత్ ఫ్లేవర్ ఏదో ఒక విధంగా ఉండే విధంగా అక్కడి దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో రాదే అనే సినిమా సల్మాన్ చేస్తున్నాడు.దాని తర్వాత టైగర్ 3 మూవీని పట్టాలు ఎక్కిస్తున్నాడు.
ఈ సినిమా ఎక్ ది టైగర్ సీక్వెల్స్ లో వస్తున్న మూడో సినిమా కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సౌత్ సూపర్ హిట్ మూవీపై సల్మాన్ ఖాన్ దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది.
ఈ మధ్య విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయిన మాస్టర్ మూవీని రీమేక్ చేసే యోచనలో సల్లుభాయ్ ఉన్నట్లు తెలుస్తుంది.కబీర్ సింగ్ సినిమాని తెరకెక్కించిన మురాద్ ఖేతానీ మాస్టర్ మూవీని రీమేక్ నిర్మించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా రీమేక్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఒక ఒరిజినల్ ని తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే ఈ రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.