డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా తెరకేక్కిస్తున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కి జోడీగా అనన్యా పాండే నటిస్తుంది.
ఇక చార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.విజయ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
అలాగే పూరీ జగన్నాథ్ తన కెరియర్ లో ఎక్కువ టైం తీసుకొని చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.
కీలక సన్నివేశాలని ముంబైలో షూట్ చేస్తున్నారు.కథ నేపధ్యం అంతా ముంబై బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుంది.
ఒక ఈ సినిమాలో మలయాళీ స్టార్ సురేష్ గోపీ, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ బయటకి వచ్చింది.
లైగర్ సినిమాలో స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ ప్రభుదేవా కూడా భాగం అవుతున్నాడని బి-టౌన్ లో చర్చించుకుంటున్నారు.
ఈ చర్చ రావడానికి ప్రధాన కారణం తాజాగా పూరీ జగన్నాథ్, చార్మీ, ప్రభుదేవా కలవడమే.
వీరు ముగ్గురు కలిసి దిగిన ఫోటోని చార్మీ ట్విట్టర్ లో షేర్ చేసింది.దీంతో ప్రభుదేవా లైగర్ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు అనే ప్రచారం బయటకి వచ్చింది.
అయితే ప్రభుదేవా ఈ సినిమాలో ఆర్టిస్ట్ గా చేస్తున్నాడా లేదా కొరియోగ్రాఫర్ విజయ్ తో డాన్స్ లు చేయించడానికి రెడీ అవుతున్నాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.విజయ్ దేవరకొండ డాన్స్ విషయంలో చాలా పూర్ అని చెప్పాలి.
ఇప్పటి వరకు అతను చేసిన ఏ సినిమాలో కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయలేదు.మరి పూరీ జగన్నాథ్ ప్రభుదేవా సహాయంతో విజయ్ దేవరకొండ చేత లైగర్ సినిమాలో డాన్స్ చేయిస్తాడేమో చూడాలి.