ఇండియన్ హీరోలకి విదేశాలలో కూడా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఆ ఫ్యాన్స్ ఒక్కోసారి తమ అభిమాన హీరో కోసం లక్షలు ఖర్చు పెట్టి ఎవరూ ఊహించని విధంగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు.
అలాంటి ట్రీట్, గిఫ్ట్స్ చూసినపుడు హీరోలు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు.రీసెంట్ గా కన్నడ హీరో కిచ్చా సుదీప్ బూర్జ్ ఖలీఫాపై తన కొత్త సినిమా డిజిటల్ పోస్టర్ ని ఆవిష్కరించారు.
ఆ విజువల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.గతంలో బాలీవుడ్ బాద్షా షారూక్ కటౌట్ ను ప్రతిష్టాత్మకమైన దుబాయ్ బుర్జ్ ఖలీఫా పై ఆవిష్కరించారు.
ఇప్పుడు అలాంటి గౌరవం రామ్ చరణ్ కి కూడా దక్కింది.ఏకంగా అమెరికాలోని నాస్డాక్ బిల్డింగ్ గా పిలిచే అమెరికా స్టాక్స్ ఎక్స్ఛేంజ్ భవనంపై రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
ఈ బర్త్ డే గ్రీటింగ్ కి సంబంధించి ఫోటోలు బయటకి రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అవి వైరల్ అయ్యాయి.
టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవం దక్కడంపై మెగా ఫ్యాన్స్ కూడా సంతోషంతో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఇదే సమయంలో పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి, అలాగే ఆచార్య నుంచి ఫస్ట్ లుక్ లు రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహం అందించాయి.మరో వైపు దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి కూడా ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయనే విషయం బయటకొచ్చింది.
మొత్తానికి రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫోటోలతో సోషల్ మీడియాలో హోరెత్తించారని చెప్పాలి.