ఆ ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వేస్తున్న నెటిజన్స్.. ఎందుకో తెలుసా..?!

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్.మరోసారి నెటిజన్స్ చేతికి చిక్కారు.ఇటీవల మహిళల వస్త్రదారణపై సంచలన కామెంట్స్ చేసి.వివాదాలకు కారణమయ్యారు.మహిళలు ధరించే చిరిగిన జీన్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురయ్యాడు.తాజాగా డెహ్రాడూన్‌ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ మరోసారి భారత్, అమెరికా పరిపాలన గురించి మాట్లాడుతూ.

 Uttarakhand Cm, Social Media, Netizens, Troles, Viral News, Viral Latest, Viral-TeluguStop.com

మళ్లీ చిక్కుల్లో పడ్డారు.

‘భారత్‌ను 200 ఏళ్ల పాటు పాలించిన అమెరికా నేడు కరోనాతో విలవిల్లాడుతున్నది.

వైద్యరంగంలో ప్రపంచంలోనే యూఎస్ నెంబర్ వన్ దేశంగా ఉన్నది.కానీ అక్కడ కరోనా బారిన పడి యాభై లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు.

ఇప్పటికీ వాళ్లు దానిని అదుపుచేయలేక మళ్లీ లాక్‌డౌన్ వైపునకు అడుగులు వేస్తున్నారు’ అంటూ చెప్పుకోచ్చాడు.ఇలాంటి సమయంలో మోదీ మన ప్రధానిగా లేకపోయుంటే.

పరిస్థితులు వేరేలా ఉండేవని అన్నారు.కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడడంలో మోదీ కృషి ఎంతో ఉందని ఆయన వ్యాఖ్యనించారు.

కొవిడ్‌ కట్టడికి కేంద్రం గట్టి చర్యలు తీసుకున్నారని ప్రశంసల వర్షం కురిపించారు.అయితే, కొందరు మాత్రమే మాస్క్ ధరించడం, శానిటైజర్‌ వాడడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారంటూ ఆందోళన కూడా వ్యక్తం చేశారు.

అంతే భారత్‏ను పరిపాలించిన బ్రిటన్ అని అనాల్సిన చోట.అమెరికా అన్నారు.అంతే.నెటిజన్ల చేతికి మరోసారి చిక్కారు.అరే.మా సిలబస్‏లో ఈ పాఠాలు ఎప్పుడు చెప్పలేదే.? ఇండియాను అమెరికా పాలించిందా.? ఇది నిజమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇటీవల యువతుల వస్త్రధారణ విషయంపై తీరథ్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.‘‘ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యా.ఆ వేషధారణతో ఎన్జీవో విషయమై ప్రజలను కలవడానికి వెళితే.సమాజానికి ఏం సంకేతాలిస్తున్నట్లు.? మన పిల్లలకు ఏం సంకేతాలిస్తున్నట్లు.? ఇదంతా ఇంటి నుంచే ప్రారంభమవుతుంది.మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు.మనం దేనిని ఫాలో అవుతామో.పిల్లలు అదే ఫాలో అవుతారు.యువతీ యువకులు మోకాళ్లను చూపుతూ ఉండే జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అని పేర్కొన్నారు.

పాశ్చాత్యులు మనల్ని అనుసరిస్తూ యోగా చేస్తూ, పూర్తిగా శరీరాన్ని కప్పేసే వస్త్రాలను వేసుకుంటుంటే.మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని తీరథ్ రావత్ వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube