తెలుగు, తమిళ భాషల్లో పదుల సంఖ్యలో పాటలు పాడి సింగర్ గా గుర్తింపును సంపాదించుకున్నారు చిన్మయి.మీటూ ఆరోపణల ద్వారా వార్తల్లో నిలిచిన చిన్మయి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
మీటూ ఆరోపణలు చేయడం వల్ల కోలీవుడ్ ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసిందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే రాహుల్ రవీంద్రన్ లాంటి భర్త దొరకడం వల్ల తాను లక్కీ అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు.
రాధారవి, వైరముత్తులపై కొన్ని ఆరోపణలు ఉన్నాయని.ఆరోపణలు ఉన్నప్పటికీ వాళ్లు సమాజంలో మంచి పేరుతో పాటు ప్రతిష్టలను కూడా అనుభవిస్తున్నారని ఆమె అన్నారు.2018 సంవత్సరం అక్టోబర్ నెల నుంచి తమిళ ఇండస్ట్రీలో తనపై బ్యాన్ కొనసాగుతోందని.వేధింపులకు గురి చేసిన వాళ్ల పేర్లను బయట పెట్టడం తప్పు కాదని ఆమె అన్నారు.
డబ్బింగ్ యూనియన్ కూడా తనపై నిషేధం విధించిందని రాధారవి ఆ డబ్బింగ్ యూనియన్ కు నాయకత్వం వహిస్తాడని చిన్మయి తెలిపారు.
తమిళంలో తనకు అవకాశాలు లేకపోయినా దేవుని దయ వల్ల ఇతర ఇండస్ట్రీల్లో ఆఫర్లు వస్తున్నాయని చిన్మయి తెలిపారు.తన ఫ్యామిలీ, భర్త అర్థం చేసుకుంటారు కాబట్టి తనకు ఏ సమస్య లేదని ఆమె చెప్పుకొచ్చారు.అయితే అండగా నిలవని ఫ్యామిలీల పరిస్థితి ఏమిటి అని ఆమె ప్రశ్నించారు.
కోలీవుడ్ ఇండస్ట్రీ తనను బ్యాన్ చేసిందంటూ చిన్మయి చేసిన కామెంట్లు కలకలం సృష్టిస్తున్నాయి.
కొనేళ్ల క్రితం చిన్మయి వైరముత్తుతో పాటు ఒక సింగర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా ఖాతాలలో చిన్మయి చేసిన ట్వీట్లు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.చిన్మయి కామెంట్లపై తమిళ సినీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.