హెబ్బా పటేల్ ని తెలిసిన వాళ్ళు ఏదో చేసారంట

అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా హైప్ సొంతం చేసుకున్న నటి హెబ్బా పటేల్. ఈ అమ్మడు కెరియర్ ఆరంభంలోనే అదిరిపోయే పాత్రతో పాపులారిటీ సొంతం చేసుకున్న తరువాత ఆ క్రేజ్ ని కొనసాగించడంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

 Hebah Patel New Movie Telisina Vallu, Odelu Railway Station, Viplav Koneti, Toll-TeluguStop.com

ఒకే తరహా పాత్రలు రావడం వలన తనలోని నటిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకోలేకపోయింది.చాలా సినిమాలలో ఆమె పాత్రల శైలి పూర్తిగా కుమారి 21ఎఫ్ తరహాలోనే ఉంటాయి.

ఈ కారణంగా చేత గ్లామర్ ప్రదర్శనలు చేసిన క్రేజీ హీరోయిన్ గా హెబ్బా కొనసాగలేకపోయింది.అయితే ఈ అమ్మడుకి సక్సెస్ రేట్ తక్కువానే ఉన్న ఇప్పటికి అడపాదడపా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

మరో వైపు ఇప్పటికే వెబ్ సిరీస్ లలో కూడా ఎంట్రీ ఇచ్చి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కెరియర్ ని బిల్డ్ చేసుకునే పనిలో ఉంది.ఇదిలా ఉంటే ఈ అమ్మడు కొత్త సినిమాకి సంబందించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం సంపత్ నంది కథతో తెరకెక్కిన ఒదేలు రైల్వేస్టేషన్ అనే సినిమాలో హెబ్బా మొదటి సారి డీగ్లామర్ పాత్రలో నటిస్తుంది.పక్కా తెలంగాణ అమ్మాయిగా ఈ సినిమాలో కనిపిస్తుంది.

ఇప్పుడు మరో కొత్త సినిమాకి ఈ భామ ఒకే చెప్పింది.తెలిసినవాళ్ళు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

ఈ టైటిల్ పోస్టర్ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ పాతకాలపు కుర్చీలో ఓ అమ్మాయి మెడ మీద తల లేకుండా కూర్చొని ఉంది.

గోడ మీద ఆ తల ఫోటో రూపంలో ఉంది.అందులో హెబ్బా పటేల్ లుక్ ఉంది.

ఈ పోస్టర్ లుక్, టైటిల్ బట్టి క్రైమ్, హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.తెలిసినవాళ్ళు అనే టైటిల్ ద్వారా తనకి భాగా పరిచయం ఉన్న వారి చేతిలో హత్య చేయబడ్డ ఓ అమ్మాయి ఆత్మగా మారి వారి మీద ఎలా రివెంజ్ తీర్చుకుంది అనే కాన్సెప్ట్ తో తెరకేక్కుతున్నట్లు కనిపిస్తుంది.

ఈ సినిమాతో విప్లవ్ కోనేటి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరోసారి డీ గ్లామర్ రోల్స్ లో ఈ సినిమాలో హెబ్బా సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube