మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలకు కమిటవుతూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రీఎంట్రీలో మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ కాగా సైరా నరసింహారెడ్డి సినిమా మోస్తరుఫలితాన్ని అందుకుంది.
ఈ సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు కావడంతో కలెక్షన్లు బాగానే వచ్చినా సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు.
ప్రస్తుతం ఆచార్య మూవీలో చరణ్ తో కలిసి నటిస్తున్న చిరంజీవి వచ్చే నెల నుంచి లూసిఫర్ రీమేక్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకునిగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరో సోదరి పాత్రలో నయనతార నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.గత కొన్ని నెలల నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న నయనతార ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
చిరంజీవి సోదరి పాత్రకు త్రిష ఎంపికైందని త్రిషనే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటించనుందని ప్రచారం జరుగుతోంది.గతంలో చిరంజీవి, త్రిష కాంబినేషన్ లో స్టాలిన్ మూవీ తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.మళ్లీ చిరంజీవి, త్రిష కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా లూసిఫర్ రీమేక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
మరోవైపు త్రిషకు కూడా ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గాయి.చిరంజీవి సోదరి పాత్రలో నటించి ఆ పాత్రలో త్రిష మెప్పిస్తే ఆమె మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.
మార్చి నెల నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు మొదలు కానున్నాయయని సమాచారం.ఈ సినిమా డైరెక్టర్ గా మొదట తెలుగు డైరెక్టర్ల పేర్లు వినిపించినా చివరకు కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఫైనల్ అయ్యారు.