అలాంటి ఫోటో షేర్ చేసిన నభా నటేష్.. అవాక్కైన ఫ్యాన్స్..?

శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో వజ్రకాయ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన నభా నటేష్ సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు.ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా నటిగా నభాకు మంచి పేరు వచ్చింది.

 Actress Nabha Natesh Instagram Photo Goes Viral In Social Media,netizens,commen-TeluguStop.com

ఆ తరువాత నభా ఇస్మార్ట్ శంకర్ లో ఊహించని స్థాయిలో పర్ఫామెన్స్ ఇచ్చి సక్సెస్ ను సొంతం చేసుకుంది.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తరువాత నభాకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.

డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాలలో నటించిన నభాకు ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం కెరీర్ కు మైనస్ గా మారింది.అందం, అభినయం పుష్కలంగా ఉన్న నభా నటేష్ తాజాగా ఒక ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో నభా కేవలం షర్ట్ మాత్రమే వేసుకొని ఉండటం గమనార్హం.నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫోటోపై కొందరు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెటిజన్లు మాత్రం అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు.మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలనే నభా హాట్ ఫోటోలను షేర్ చేస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నితిన్ హీరోగా నటిస్తున్న అంధాధూన్ తెలుగు రీమేక్ సినిమాలో కూడా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.అంధాధూన్ సినిమాకు టైటిల్ ఫిక్స్ కావాల్సి ఉంది.

ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.కుర్రకారు మతులు పోగొట్టే విధంగా నభా హాట్ ఫోటో షేర్ చేయడంతో నభా ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube