ఎత్తైన భవంతులు చూడడానికి ఎంతో అందంగా కనిపించినా అవి చాలా ప్రమాదకరం అని మనకు ఇప్పటివరకు జరిగిన ఎన్నో సంఘటనల్లో రుజువైంది.ఎందుకంటే వాటి నాణ్యతపై అంతగా అవగాహన ఉండక పోగా ఎత్తైన టవర్స్ అవడం వల్ల అవి ఎక్కువగా ప్రమాదకరంగా ఉంటాయి.
ఎత్తైన టవర్స్ కాలక్రమేణా అవి బలహీనంగా మారుతాయి.వాటిని గ్రహించడంలో లోపం ఏర్పడుతుంది.
ఇలా ఓ 84 అడుగుల ఎత్తైన టవర్ నేలమట్టమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.అమెరికాలోని ఉటాటోలో గల సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ అథారిటీ తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది.84 అడుగుల ఎత్తైన టవర్ ఒక్కసారిగా అకస్మాత్తుగా కుప్ప కూలిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.అయితే ఈ టవర్ చాలా పురాతనమైనదని, ఆ టవర్ స్థానంలో ఆధునికీకరణలో భాగంగా నూతన టవర్ ను నిర్మించతలపెట్టామని అందుకే ఈ టవర్ ని తొలగించామని విమానాశ్రయ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇంత ఎత్తైన టవర్ ఒక్కసారిగా కుప్పకూలిన వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.
ఓ లుక్కేయండి మరి.
.