బిడ్డను ప్రసవించిన మైనర్ బాలిక.. వెలుగులోకి వచ్చిన నిజం..

రోజురోజుకూ దారుణాలు ఎక్కువవుతున్నాయి.చదువుకోవాల్సిన యువత తప్పుదారి పడుతుంది.

 Minor Girl Cheated Issue Comes To Light After Delivery,minor Girl,nizamabad, Gir-TeluguStop.com

చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు.చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి అంటూ తప్పుదోవ పడుతున్నారు.

ఒక మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఒక యువకుడు మోసం చేసిన ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది.

ఒక యువకుడు మైనర్ బాలికను ప్రేమిస్తున్నాని వెంటపడి ఆమెను గర్భవతి చేసాడు.

గర్భవతి అయిందని తెలిసిన ఏవేవో సాకులు చెబుతూ వచ్చాడు.ఆ బాలిక నెలలు నిండి ప్రసవించిన పట్టించుకోలేదు.

చివరకు ఈ విషయం బాలిక బంధువులకు తెలియడంతో ఈ దారుణమైన ఘటన బయటపడింది.బాలిక బంధువులు ఈ విషయం తెలుసుకుని ఆ యువకుడిపై ఫిర్యాదు చేసారు.

నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డి పేటకు చెందిన ఒక యువకుడు అదే మండలంలోని పక్క గ్రామానికి చెందిన బాలికపై కన్నేశాడు.

ఆ మైనర్ బాలికకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు.ఇప్పుడు ఆ బాలిక తన అక్క వద్ద ఉంటుంది.ఆ యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెతో శారీరక సంభందం పెట్టుకుని గర్భవతిని చేసాడు.

ఆ యువకుడు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన విషయం తెలుసుకున్న అక్క కుటుంబ సభ్యులు ఈ విషయంపై నిలదీస్తే పెళ్లి చేసుకుంటానని సాకులు చెబుతూ కాలాన్ని గడిపాడు.

అయితే ఈ లోపు బాలికకు నెలలు నిండి ఒక బిడ్డను ప్రసవించింది.అప్పటి వరకు ఎవ్వరికి తెలియని ఈ విషయం బిడ్డను కనడంతో ఆమె బంధువులకు తెలిసింది.

బంధువులు పోలీసులను కలిసి ఆ యువకుడిపై ఫిర్యాదు చేసారు.మైనర్ బాలికను మోసం చేసి తల్లిని చేసాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube