సుధీర్ బాబు హీరోగా నటించిన ఎస్.ఎం.ఎస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తొమ్మిది సంవత్సరాల క్రితం హీరోయిన్ రెజీనా ఎంట్రీ ఇచ్చారు.తొలి సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా రెజీనా ఆ తరువాత కాలంలో నటించిన రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వులేని జీవితం, పవర్, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలు హిట్ కావడంతో పాటు నటిగా ఆమెకు మంచి పేరును సంపాదించి పెట్టాయి.
అయితే కెరీర్ తొలినాళ్లలో రెజీనా నటించిన సినిమాలు హిట్టైనా ఆ తరువాత కాలంలో ఆమె నటించిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వకపోవడం రెజీనా కెరీర్ కు మైనస్ గా మారింది.
సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రెజీనా ప్రస్తుతం నేనేనా అనే సినిమాలో నటిస్తున్నారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి రెజీనా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతోందని ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఆమె అన్నారు.తనకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం గురించి సరైన అవగాహన ఉండేది కాదని రెజీనా పేర్కొన్నారు.తాను సినిమా ఇండస్ట్రీలో సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగానని.వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నైనా తాను అస్సలు పట్టించుకోనని రెజీనా అన్నారు.
ఏదైనా సినిమా కథ విన్న తరువాత ఇతరులతో ఆ సినిమాల గురించి చర్చించి నిర్ణయం తీసుకోవడం తనకు అస్సలు నచ్చదని చెప్పారు.ఈ క్రమంలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని ధైర్యంగా అధిగమించి ముందడుగులు వేశానని ఆమె అన్నారు.
భవిష్యత్తులో కూడా ఇదే విధంగా తాను ముందుకు సాగుతానని రెజీనా తెలిపారు.