ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్చకులకు వైసీపీ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలావరకు మతాల తరహాలో గుళ్లు, గోపురాలు, విగ్రహ ధ్వంస ఘటనలు బేస్ చేసుకుని అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి తరుణంలో అధికారంలో ఉన్న వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకులకు శుభవార్త చెప్పుకొచ్చింది.
రాష్ట్రంలో ఆదాయం లేని ఆలయాలకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.5000/- గౌరవ వేతనాన్ని రూ.10,000/- పెంచుతున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.అంతేకాకుండా రూ.10వేలుగా ఉన్న భృతిని రూ.16500 చేస్తామన్నారు.విజయవాడలో అర్చకులతో మంత్రి సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయం నడుస్తూ ఉండగానే అర్చకులకు వారసత్వ హక్కులు కల్పించడానికి చర్యలు కూడా ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అర్చకులకు కొంత సంతోషాన్ని ఇచ్చినట్లయింది.