కంటెంట్ బేస్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.ఈ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు అ, కల్కీ సినిమాలతో కంటెంట్ పరంగా సక్సెస్ అయిన కమర్షియల్ గా మాత్రం ఇంకా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.
ఈ నేపధ్యంలో ఈ సారి కచ్చితంగా కమర్షియల్ హిట్ కొట్టాలనే కసితో తన క్రియేటివ్ థాట్స్ కి కమర్షియల్ బ్యాక్ డ్రాప్ అయిన రాయలసీమని ఎంచుకున్నాడు.ఈ సారి కథని సీరియస్ గా చెప్పే ప్రయత్నం చేయకుండా కామెడీ టచ్ ఇచ్చి చివర్లో భయాన్ని పరిచయం చేసే ప్రయత్నం జాంబీరెడ్డితో చేస్తున్నాడు.
ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా ప్రభాస్ రిలీజ్ చేశాడు.ఇదిలా ఉంటే తేజ సజ్జు హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో కంటెంట్ ని హైదరాబాద్ నుంచి కొంత మంది ఫ్రెండ్స్ రాయలసీమకి ఫ్రెండ్ పెళ్లి కోసం వెళ్తారు.
అక్కడ జరిగే వినోదాన్ని తెరపై ఆవిష్కరించాడు.అయితే కరోనా వైరస్ కాస్తా భయానకంగా మారి మనుషులని జాంబియన్స్ చేసేస్తే పరిస్థితి ఏంటి అనే విషయానికి ఫాంటసీ మిక్స్ చేసి జాంబియన్స్ ని కథలోకి తీసుకొచ్చాడు.
ఇక అక్కడి నుంచి హీరో గ్యాంగ్ జాంబియన్స్ నుంచి తమని తాము కాపాడుకుంటూ బయటపడటానికి చేసే పోరాటంతో కంటెంట్ ని నడిపించాడు.ట్రైలర్ చూస్తూ ఉంటే ఆడియన్స్ కి వినోదంతో పాటు భయాన్ని కూడా ప్రశాంత్ వర్మ పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది.
కరోనాకి లింక్ పెట్టి చెబుతున్న ఈ జాంబియన్స్ కథతో ఈ సారి కమర్షియల్ హిట్ కొట్టాలని కసితో దర్శకుడు ఉన్నాడు.అయితే తెలుగు ఆడియన్స్ కి సినిమాలలో హెవీగా బ్లడ్ కనిపిస్తే చూడటానికి ఆసక్తి చూపించరు.
మరి జాంబియన్స్ అంటేనే తెరపై మొత్తం బ్లడ్ కనిపిస్తుంది.మరి ప్రశాంత్ వర్మ తన స్టోరీ నేరేషన్ తో ప్రేక్షకుల మైండ్ సెట్ ని ఈ సినిమా ద్వారా మార్చగలడేమో చూడాలి.