నిర్మాతగా మారబోతున్న సోనూసూద్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి తరువాత విలన్ గా, స్టార్ నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి సోనూసూద్.సోనూసూద్ సినిమా కెరియర్ పరంగా ఇన్నేళ్ల కాలంలో ఎంత ఇమేజ్ సంపాదించాడు.

 Sonu Sood Start Production House, Tollywood, Bollywood, Telugu Cinema, Lock Down-TeluguStop.com

దానికి రెట్టింపు గుర్తింపు, గౌరవం ఈ ఒక్క ఏడాదిలోనే సంపాదించాడు.లాక్ డౌన్ టైంలో వలస కార్మికులకి సోనూసూద్ చేసిన సేవలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయారు.

తరువాత ఎప్పటికప్పుడు కష్టంలో ఉన్న వారికి అండగా నిలబడుతూ తన సేవాగుణంతో అందరి మన్ననలు పొందుతున్నాడు.ఈ నేపధ్యంలో ఈ లాక్ డౌన్ కాలంలో సోనూసూద్ క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోలని మించిపోయింది.

వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోలలో ఎవరూ కూడా ఒక్క రూపాయి కష్టకాలంలో పేదల కోసం వెచ్చించింది లేదు.కానీ సోనూసూద్ మాత్రం తన ఆస్తిని తాకట్టు పెట్టి సాయం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆచార్య సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్న అతన్ని కొట్టడానికి కూడా చిరంజీవి ఇబ్బంది పడ్డాడంటే అతని మీద సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరికి ఎంత గౌరవం పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే సోనూసూద్ నటుడు నుంచి తన ప్రయాణంలో మరో అడుగు ముందుకి వేస్తున్నాడు.

సినిమా నిర్మాతగా మారేందుకు సిద్ధం అవుతున్నాడు.గతంలో గతంలో ఇండో చైనీస్ మూవీగా తెరకెక్కిన కుంఫూ యోగా అనే సినిమాకి నిర్మాణ భాగస్వామిగా పెట్టుబడులు పెట్టాడు.

అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.అయితే కొత్త సంవత్సరం నుంచి నిర్మాతగా తన కొత్త ప్రయాణం ఉండబోతుంది అని తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

తన తండ్రి శక్తి సాగర్ పేరు మీదుగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పాడు.ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సినిమాలు నిర్మిస్తానని పేర్కొన్నాడు.

ఇక ఈ సినిమాలలో తాను హీరోగా నటించే అవకాశాలు కూడా ఉన్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube