1.టీజీవో, టిఎన్జీవోలతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ సమావేశం అయ్యారు.
2.హైదరాబాద్ లో పోలీసుల ఆంక్షలు
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీసులు అనేక ఆంక్షలు విధించారు .ఈరోజు ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు కొనసాగుతాయి.
3.నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్ద పులి
నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లి గ్రామ సమీపంలో సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనతో వణికిపోతున్నారు.
4.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 674 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
5.ఎంబిబిఎస్ సీట్లు కేటాయింపు పై గవర్నర్ ఆరా
ప్రభుత్వ వైద్య కళాశాలలో తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన ఎంబిబిఎస్ సీట్లు పొరుగు రాష్ట్రాల వారికి కేటాయించారు అంటూ అనేక మంది విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు.ఈ మేరకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కరుణాకర్ రెడ్డి ని రాజ్ భవన్ కు పిలిపించి మాట్లాడారు.
6.ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సి ) ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది.అభ్యర్థులు (https://study circle.cgg.gov.in) వెబ్సైట్ లో జనవరి 5 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
7.కామారెడ్డి జిల్లా కు డిజిటల్ ఇండియా అవార్డు
పరిపాలన లు డిజిటలైజేషన్ ప్రవేశపెట్టినందుకు కామారెడ్డి జిల్లా కు డిజిటల్ ఇండియా అవార్డు 2020 లభించింది.జిల్లాస్థాయి డిజిటల్ గవర్నెన్స్ విభాగం లో లభించింది.ఈ అవార్డును వీడియో ద్వారా జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ద్వారా జిల్లా కలెక్టర్ శరత్ అందుకున్నారు.
8.రిటర్నుల దాఖలు గడువు జనవరి 10 వరకు
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు గడువు మూడో విడత పొడిగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది.దీంతో 2019 -20 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తులు తమ ఆదాయపన్ను రిటర్నులను ( ఆడిట్ అవసరం లేని వారు) జనవరి 10 వరకు ఎటువంటి ఆలస్యం రుసుము లేకుండా దాఖలు చేసుకోవచ్చు .
9.డిఎల్ఎఫ్ భూ వ్యవహారంపై హైకోర్టు స్పందన
డిఎల్ఎఫ్ను భూ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం పై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు బుధవారం ప్రతి వాదుల ను ఆదేశించింది.
10.యోమెన్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు
యోమెన్ లోని ఏడెన్ నగర విమానాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది.దేశంలో కొత్తగా ఏర్పాటు అయిన క్యాబినెట్ మంత్రులతో కూడిన విమానం రావడానికి కొంచెం ముందు ఈ పేలుడు సంభవించినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
11.అమ్మకానికి ఆకాశ్ క్షిపణులు
దేశీయంగా తయారు చేసిన ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
12.రోడ్ల మరమ్మతులకు 550 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం 550 కోట్లను కేటాయించింది.
13.రైతు బజార్లలో కొత్త దుకాణాలు
రైతు బజార్లలో కొత్తగా చోట బేకరీలు ఏటీఎం జనరిక్ మెడిసిన్ బియ్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కొత్త దుకాణాలను నిర్మించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు.
14.కరోనా తో కంటి చూపు కు ముప్పు
కోవేట్ తో కొందరిలో కంటి చూపు మందగిస్తుంది అని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.కంటి సమస్యలు తలెత్తడం వల్ల కంటి చూపు తగ్గుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
15.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,950
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -49,940
16.కరోనా పరిశోధనలపై చైనా కన్ను
కరోనా వైరస్ కారణం ఏంటనేది తెలుసుకునేందుకు చేస్తున్న పరిశోధనలు అన్నింటిపైనా చైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిఘా వేసి మరి అడ్డుకుంటోంది.దీనికి సంబంధించిన కీలక అంశాలను అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ ) వార్త సంస్థ ప్రతినిధుల బృందం బయట పెట్టింది.
17.కువైట్ సోకిన వృద్ధులకు గుండెపోటు
కువైట్ మరణ పడి తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుల్లో గుండెపోటు రావడం సాధారణమైన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.ముఖ్యంగా 80 ఏళ్లు పైబడినవారిలో ఎటువంటి ముప్పు సహజమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
18.లాక్ డౌన్ దిశగా బ్రిటన్
కొత్త రకం కరోనా వైరస్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి లో లాక్ డౌన్ విధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ప్రస్తుత పరిస్థితిని గురించి ప్రభుత్వం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది.
19.భారత్ లో కరోనా
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.గడిచిన 24 గంటల్లో 21,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది.
20.జనవరి 9న సింగర్ సునీత వివాహం
వచ్చే నెల 9వ తేదీన నా వివాహం జరగనున్నది ” అంటూ సింగర్ సునీత స్వయంగా వెల్లడించారు.