కపిల్ సిబల్ కు చురకలు అంటించిన కాంగ్రెస్ నేత

ఇటీవల బీహార్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం తో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యంగ్యంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఇలా ఓటమి పాలుకావడం పార్టీ కి మామూలే అని,దీనిపై పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలి అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు.

 Join In Another Party Says Congress Leader Adhir Ranjan Chowdhury, Kapil Cibal,-TeluguStop.com

అయితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ అధినాయకత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.నిన్నటివరకు లోపల లోపల ఉండే ఈ విమర్శలు ఇప్పుడు బట్టబయలు అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్న సిబల్ కు అదే పార్టీ మరో నేత చురకలు అంటించారు.కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న వారు ఏదైనా మరో పార్టీ లో చేరాలని,లేదంటే వారే కొత్త పార్టీ పెట్టుకోవచ్చు అంటూ లోక్ సభలో వ్యాఖ్యలు చేసారు.

అంతేకాని అదేపనిగా పార్టీని ఇరకాటాన పెట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి అంటూ ఆయన కోరారు.అంతేకాకుండా బీహార్ ఎన్నికల సమయంలో వీరు పార్టీ విజయానికి ఏవిధమైన కృషి చేసారా అని కూడా ఆయన ప్రశ్నించారు.

వీళ్లంతా గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి చాలా సన్నిహితులని ఆయన చెప్పారు.తమకు కాంగ్రెస్ సరైనది కాదని భావించినప్పుడు ఇలాంటి వ్యక్తులు వేరే పార్టీలో చేరడానికి అభ్యంతరమేముంటుంది అని అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు.

Telugu Adheerranjan, Kapil Cibal, Rahul Ghandi-Telugu Political News

ఈ విధమైన విమర్శలు పార్టీకి నష్టం కలుగజేస్తాయన్నారు.వీరు పార్టీ నాయకత్వం వద్ద గానీ, సరైన వేదికల్లో గానీ స్వేఛ్చగా తమ అభిప్రాయాలను వివరిస్తే బాగుంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయాన్ని అందుకోవడం తో ఏడోసారి బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం కూడా చేసిన విషయం విదితమే.అయితే ఈ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ కూటమి తో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ ఓటమి పాలవ్వడం పై సిబల్ విమర్శలు చేయడం తో రంజన్ చౌదరి పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube