తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎన్.వి.
బి చౌదరి దర్శకత్వం వహించిన “కీచక” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “యంగ్ బ్యూటీ యామిని భాస్కర్” గురించి తెలియని వారుండరు.అయితే యామిని భాస్కర్ ఈ చిత్రంలో నటించడానికంటే ముందే ప్రముఖ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “రభస” అనే చిత్రంలో నటించింది.
కానీ ఈ చిత్రంలో ఈ అమ్మడు పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.అయితే గత కొద్ది నెలలుగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులు లేక ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.
ఈ క్రమంలో యామిని భాస్కర్ కొంతమేర బరువు పెరిగింది. కానీ ఇటీవలే షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మళ్ళీ చిత్రీకరణ పనులు మొదలవడంతో ఈ అమ్మడు బరువు తగ్గే పనిలో పడింది.
ఈ క్రమంలో రోజులో ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతూ వర్కౌట్లు చేస్తూ బాగానే శ్రమిస్తోంది. అంతేకాక డైట్ విషయంలో కూడా ప్రత్యేకంగా ట్రైనర్ ని నియమించుకొని మరి డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
అయితే అప్పుడప్పుడు ఈ అమ్మడు జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తోంది.ప్రస్తుతం ఈ అమ్మడు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్లాప్ అవుతున్నాయి. దీంతో తన తదుపరి చిత్రం కథల విషయంలో యామిని భాస్కర్ కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.
అంతేకాక ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో వెబ్ సిరీస్ లలో నటించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.