భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో ప్రయాణం ఇలా చేయడం అంటే అది కేవలం రైలు ప్రయాణం మాత్రమే సాధ్యం.అయితే ప్రస్తుత కాలంలో రైల్ టికెట్ సంపాదించడానికి చాల కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది.
రోజురోజుకి రైల్ టికెట్ దొరకడం ఎంతో కష్టతరంగా మారిపోతుంది.సమయంలో ట్రైన్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే సీట్లు ఫీల్ అయిపోవడం టిక్కెట్లు లేవు అంటూ కనపడుతుంటాయి.
ఇలాంటివి పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమయంలో మాత్రం మరింత కష్టంగా ఉంటుంది.అయితే మూడు నెలల ముందే టిక్కెట్లు ఐఆర్సీటీసీ విడుదల చేసిన రిలీజ్ చేసిన 48 గంటల్లో పూర్తి అయిపోతున్నాయి.
అయితే ఇప్పుడు ఐఆర్సీటీసీ ఓ కొత్త రూల్స్ ను తీసుకువచ్చింది.దీనితో ఇప్పుడు చివరి నిమిషంలో కూడా రైలు ఎక్కే చాన్స్ మీకు దొరకవచ్చు.
తాజాగా రైల్వే రిజర్వేషన్ విధానంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి.
ట్రైన్ బయలుదేరే సమయానికి కేవలం 5 నిమిషాల ముందే మీకు టికెట్ కన్ఫామ్ కూడా కావచ్చు.
కొత్తగా వచ్చిన నియమాల ప్రకారం ఇకపై రైళ్లకు సెకండ్ రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేయబోతున్నారు.దీనితో రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు కూడా రిజర్వేషన్ సీట్ బుక్ చేసుకునే వెసులుబాటును రైల్వేశాఖ తీసుకువచ్చింది.
అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగానే ఇంటర్నెట్ వినియోగదారులు లేదా కౌంటర్ వద్ద ఆ ట్రైన్ సంబంధించిన ఖాళీ సీట్ల టిక్కెట్లను పొందవచ్చు.దీంతో ఇప్పుడు రైల్వేశాఖ రెండుసార్లు చార్ట్ సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ కొత్త విధానంతో ప్యాసింజర్ లకు మాత్రం లాభం కలుగుతుంది.ముఖ్యంగా సుదూర ప్రాంతాల వెళ్లాలనుకునే ప్రయాణికులకు మాత్రం ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కేవలం కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్నారు.రైలు బయలుదేరడానికి కేవలం అరగంట ముందే రెండవ రిజర్వేషన్ చార్టును విడుదల చేస్తారు.
దీంతో మీరు ఎక్కాల్సిన రైలులో చివరి నిమిషంలో అయినాసరే సీట్లు ఖాళీగా కనిపించిన వెంటనే బుక్ చేసుకుని వెళ్ళవచ్చు.కాబట్టి సుదూర ప్రాంతానికి వెళ్లేవారికి టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు చివరి నిమిషం వరకు కూడా వేచి చూడవచ్చు.