కరోనా భయంతో ఊరంతా ఖాళీ.. ఎక్కడంటే..?

కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రజల జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది.కరోనా పేరు చెబితే ప్రజలు గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది.

 Covid 19 Fear People Leaved The Village In Kamareddy District Coronavirus, Lock-TeluguStop.com

చైనాలోని వుహాన్ నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి వల్ల ప్రజలు ప్రశాంతకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు.ఈ దేశం ఆ దేశం అనే తేడాల్లేకుండా అన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.

మొదట్లో నగరాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదు కాగా వైరస్ పల్లెలకు సైతం పాకుతోంది.

కరోనాపై ప్రజలకు గతంతో పోలిస్తే భయం తగ్గినా సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే పూర్తిస్థాయిలో భయాందోళనలు తొలగిపోయే అవకాశం ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవడం మినహా కరోనా సోకకుండా మరో మార్గం లేదు.అయితే తెలంగాణలో కరోనా భయంతో ఊరంతా ఖాళీ అయింది.

కామారెడ్డి జిల్లాలోని బీబీపేట ఊరిని ఖాళీ చేశారు.

ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు మాత్రం గ్రామ ప్రజలంతా ఊరి బయట ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ ఒక రోజంతా ఊరికి దూరంగా ఉండటం వల్ల గ్రామంలో కరోనా నియంత్రణలోకి వస్తుందని చెబుతున్నారు.సాయంత్రం గ్రామస్తులు చీకటి పడే సమయానికి గ్రామంలోకి రానున్నారు.

ఉదయం వెళ్లే సమయంలో డబ్బు మోతలు మోగిస్తూ పచ్చిన బండారు చల్లుతూ మేకను బలిచ్చి వెళ్లామని గ్రామస్తులు చెప్పారు.

ఈరోజు పొలాలకు పెళ్లి వంట చేసుకుని తిన్నామని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

గతంలో ఏవైనా వైరస్ లు, బ్యాక్టీరియాలు విజృంభిస్తే గ్రామస్తులు కొన్ని రోజుల పాటు ఊరిబయట జీవనం సాగించేవారు.ఇప్పుడు కూడా కరోనా వల్ల అలాంటి పరిస్థితులే నెలకొన్నాయని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube