తెలుగులో తన గలగల మాటలు మరియు అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆ కట్టుకున్నటువంటి టాలీవుడ్ “బ్యూటిఫుల్ యాంకర్ భాను శ్రీ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు మొదట్లో హీరోయిన్ అవ్వాలని సినిమా పరిశ్రమకి వచ్చినప్పటికీ ఎందుకో హీరోయిన్ కాలేకపోయింది.
దీంతో ప్రస్తుతం టాలీవుడ్ బుల్లితెర లోని షోలు ఈవెంట్ లకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బాగానే రాణిస్తోంది.
అయితే ఈ మధ్య కాలంలో యాంకర్ భాను శ్రీ పలు ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందాలు ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇస్తోంది.
అంతేగాక ఆ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ రోజురోజుకీ అభిమానుల సంఖ్య పెంచుకుంటోంది. అయితే ఈ మధ్యకాలంలో యాంకర్ భానుశ్రీ సినిమా అవకాశాల కోసం కొంతమేర గ్లామర్ డోస్ పెంచిన ట్లు తెలుస్తోంది.
అంతేకాక ఇదివరకే టాలీవుడ్ యంగ్ దర్శకుడు శ్యామ్ జె చైతన్య దర్శకత్వం వహించిన టువంటి “ఏడు చేపల కథ” అనే చిత్రంలో కొంత మేర బోల్డ్ తరహాలో కనిపించింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ భాను శ్రీ ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినటువంటి “అదిరింది” షోలో కో-వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
అలాగే ఓ టాలీవుడ్ యంగ్ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.