మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు.లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా తర్వాత మెగాస్టార్ రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు.
అందులో ఒకటి లూసిఫర్ రీమేక్ కాగా, మరొకటి తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళం రీమేక్.ఈ రెండింటిలో లూసిఫర్ కి వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నారు.
రెండో రీమేక్ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక ఈ రెండింటిని ఒకే సారి స్టార్ట్ చేసే యోచనలో చిరంజీవి ఉన్నాడు.
ఈ నేపధ్యంలో రెండు సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.ఇదిలా ఉంటే వేదాళం రీమేక్ కోసం చిరంజీవి మెహర్ రమేష్ కి బడ్జెట్ చాలా లిమిటెడ్ గా ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది.
అదే సమయంలో అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా కాస్ట్ కటింగ్ మీద చిరంజీవి దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే వేదాళం రీమేక్ లో చిరంజీవి చెల్లిగా సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తుందనే టాక్ నడుస్తుంది.
ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు కాని ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త కూడా వినిపిస్తుంది.ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా డిజైన్ చేయడం కోసం కేజీఎఫ్ కి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా చేసినఅన్బు, అరివు ని రంగంలోకి దించుతున్నారనే మాట వినిపిస్తుంది.
ఇప్పటికే వీరితో చర్చించడం జరిగిందని యాక్షన్ ఎపిసోడ్స్ కేజీఎఫ్ రేంజ్ లో హై ఇంటెన్సన్ తో ఉండే విధంగా డిజైన్ చేయడానికి వీరిని తీసుకున్నట్లు సమాచారం.కేజీఎఫ్ కు జాతీయ అవార్డును గెలుచుకున్న వీరిద్దరూ మెహర్ రమేష్ తో పాటు చిరంజీవిని కలుసుకున్నారని తెలుస్తోంది.
మహతి స్వరా సాగర్ వేదాళం రీమేక్ కోసం ఒక పాటను రికార్డ్ చేసారని టాక్ నడుస్తుంది.మొత్తానికి మెహర్ రీ ఎంట్రీని గ్రాండ్ గా చాటుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది.