మాంసం తిన్న వ్యక్తి కడుపులో 17 అడుగుల పాము.. చివరకు?

మనలో చాలామంది మాంసం అంటే చాలా ఇష్టపడతారు.మాంసం లేకుండా ముద్ద దిగని వారు చాలామందే ఉంటారు.

 Thailand Man Suffering From Severe Stomach Ache Pulls Out 17 Ft Yellow Tapeworm-TeluguStop.com

అయితే మాంసం అతిగా తింటే మాత్రం మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది.ఉడికీఉడకని మాంసం తిన్నామంటే మరీ ప్రమాదం.

తాజాగా థాయిలాండ్ లో జరిగిన ఒక ఘటన గురించి తెలిస్తే మాంసం తినాలంటే కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది.

థాయిలాండ్ లో నఖోవ్ సావాన్ ప్రాంతంలో డుయాంగ్‌చ‌న్ డాచోడ్డే అనే వ్యక్తి నివశించేవాడు.

ప్రస్తుతం అతని వయస్సు 43 సంవత్సరాలు.మాంసం అంటే అతనికి చాలా ఇష్టం.

జంతువులతో సంబంధం లేకుండా అన్ని జంతువుల మాంసాన్ని అతడు ఆరగించేవాడు.కొన్ని సందర్భాల్లో ఆకలేస్తే పచ్చి మాంసాన్ని కూడా తినేసేవాడు.

ఇంట్లో మాంసం ముక్కలను ఉడికించే సమయంలో ఉడికీఉడకని ముక్కలను కూడా తింటూ ఉండేవాడు.

అయితే అతిగా మాంసం తినడమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది.

అలా మాంసం ద్వారా అతని కడుపులోకి ప్రవేశించిన టేప్ వార్మ్ అంతకంతకూ పెరిగిపోయింది. మనుషుల ప్రేగుల్లో జీవించే ఒక రకమైన ఏలికపామును టేప్ వార్మ్ అంటారు.

దీంతో దాచోడ్డేకు కడుపునొప్పి రావడంతో పాటు మల ద్వారం దగ్గర పసుపు రంగులో పాము కనిపించింది.డాక్టర్లు అతని కడుపులో గొడ్డుమాంసం టేప్‌వార్మ్‌ ఉన్నట్టు గుర్తించి శస్త్రచికిత్స చేశారు.

దాచోడ్డే ఆపరేషన్ చేసిన తరువాత తనకు బాగానే ఉందని ఇకపై మాంసం తినే సమయంలో జాగ్రత్త వహిస్తానని చెప్పారు.పంది మాంసం, గొడ్డు మాంసం తినేవాళ్లు పూర్తిగా ఉడికిన మాంసాన్నే తినాలని లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్పారు.

టైనియా సాగినాటా పేరుతో ఈ టేప్ వార్మ్ ను పిలుస్తారని.చిన్న ఏలికపాము అతని కడుపులో చేరి క్రమంగా పెరిగి పెద్దదైందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube