పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే సినిమాలకు పవర్ఫుల్ టైటిల్‌ను పెడుతుంటారు చిత్ర దర్శకనిర్మాతలు.ఇక ఈ క్రమంలోనే గతంలో పవన్ ‘సత్యాగ్రహి’ అనే సినిమాలో నటిస్తానంటూ చెప్పడంతో ఆయన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తాడా అని పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
కానీ ఆయన ఈ సినిమా ఊసే ఎత్తకపోవడంతో ఈ సినిమా అటకెక్కేసిందని అందరూ ఫిక్స్ అయ్యారు.అయితే తాజాగా సత్యాగ్రహి అనే టైటిల్‌తో ఓ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
టాలీవుడ్లో నిత్యం ఏదో ఒక విషయంపై హల్చల్ చేసే బ్యూటీ మాధవీలత, తాజాగా ‘సత్యాగ్రహి’ అనే సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను పవన్ బర్త్‌డే కానుకగా రిలీజ్ చేశారు.
గతకొంత కాలంగా సినిమాలే చేయని మాధవీలత, ఇప్పుడు సత్యాగ్రహి టైటిల్‌తో వస్తుండటంతో అందరూఅవాక్కవుతున్నారు.ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో పవన్ కళ్యాణ్ బొమ్మను పెట్టుకుని క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసింది ఈ బ్యూటీ.
అయితే పవన్ టైటిల్‌తో పాటు ఆయన బొమ్మను కూడా ఈ సినిమాలో పెట్టుకుని పవన్ ఫాన్స్ దృష్టిని ఆకట్టుకునేందుకే ఈ భజన కార్యక్రమం చేస్తున్నారని కొందరు క్రిటిక్స్ అంటున్నారు.కాగా ఈ సినిమాలో పవన్ కథను తీసుకుంటారా లేక ఆయన అభిమానిగా కథను నడిపిస్తారా అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుసుంది.
అయితే ‘మా నాయకుడు ఓట్లు అడగమని చెప్పారు, కొనమని కాదు’ అంటూ క్యా్ప్షన్ పెట్టడంతో ఈ సినిమా ఎలాంటి వివాదాలను క్రియేట్ చేస్తుందా అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.కృష్ణచైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.