కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో శుభవార్త!

దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది.ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

 Scientists Good News About Corona Vaccine, Coronavirus Vacine, Scientists, Janav-TeluguStop.com

అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నా భారత్ లో మాత్రం వైరస్ ఉధృతి కొనసాగుతోంది.కొన్ని రోజుల క్రితం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ రూపం మార్చుకుంటుందని తేలింది.

రూపం మార్చుకోవడం వల్ల వ్యాక్సిన్ వచ్చినా పని చేయకపోకవచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావించారు.

కానీ తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో వైరస్ కు రూపం మారినా సమస్య లేదని ఒకే రకమైన వ్యాక్సిన్ వైరస్ పై సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది.

అమెరికాలోని వాటర్ రీడ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ మరియు కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు పీ.ఎన్.ఏ.ఎస్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.మొత్తం 84 దేశాల నుంచి 18,514 మంది నుంచి వైరస్ జన్యుక్రమాన్ని సేకరించి పరీశీలన అనంతరం ఈ ఫలితాలను వెల్లడించారు.

శరీరంలోకి వైరస్ ప్రవేశించిన తరువాత వైరస్ మార్పు చెందినట్లు ఆధారాలేమీ లేవని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఈ అధ్యయనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న వ్యాక్సిన్లతో వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వెల్లడించింది.మరోవైపు గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి కరోనా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నాగేశ్వరరెడ్డి వైరస్ లో ఎన్ని మార్పులు వచ్చినా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పారు.

డిసెంబర్ చివరి నాటికి లేదా జనవరి నెల తొలి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తెలిపారు.

ఇతర వైరస్ లు రూపం మార్చుకోవడం వల్ల వ్యాక్సిన్ తయారీలో ఇబ్బందులు ఏర్పడినా కరోనా వైరస్ విషయంలో ఆ సమస్యలు ఉండవని పరిశోధకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube