క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా ఎవరో కాదు.. మన వైజాగ్ అమ్మాయే.!

మగువలకు అందం ఓ అలంకారం.అలాంటి అందం కోసం వారు ఎంతో శ్రద్ధ వహిస్తారు.

 Queen Of South India, Vizag, Bhavani Durga, India Media Works, Green India Chall-TeluguStop.com

కొంతమంది అమ్మాయిలు మాత్రం అందాన్నే వారి కెరియర్ గా మలుచుకుంటారు.దానికోసం వారు మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంటారు.

రాత్రనకా పగలనకా దానికోసం శ్రమిస్తారు.అందాల కిరీటాన్ని దక్కించుకోవాలని కలలు కంటూ వుంటారు.

అలా కలలు కన్న విశాఖ జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన అమ్మాయి ‘క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ కిరీటాన్ని దక్కించుకోవడం మనకందరికీ గర్వకారణం.

ఇండియన్‌ మీడియా వర్క్స్‌ సీఈఓ అయినటువంటి ‘జాన్‌ అమలాన్‌’ సారథ్యంలో.ఈ సంవత్సరం జూన్‌ 28 నుంచి ఆగస్టు 25 వరకు చెన్నైను కేంద్రంగా చేసుకొని ‘కింగ్‌ అండ్‌ క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా – 2020’ ఆన్‌ లైన్‌ పోటీలు నిర్వహించారు.3 దశలుగా జరిగిన ఈ పోటీల్లో గాజువాక మండలం, కూర్మన్నపాలేనికి చెందిన కే.భవానీ దుర్గ విజేతగా నిలుస్తూ.కిరీటం సాధించింది.

కాగా.ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వనితలు పాల్గొన్నారు.

Telugu Bhavani Durga, Greenindia, India Works, Queen India, Vizag-

ఇకపోతే.మొదటి రౌండ్ ‌లో గ్రీన్‌ ఇండియా చాలెంజ్, రెండో రౌండ్‌లో ర్యాంప్‌ వాక్, మూడో రౌండ్‌ లో వివిధ సామాజిక, సమకాలిన అంశాలపై ప్రశ్నలు అడిగారు.ఫలితాలు ఆగస్టు నెల 30న వెలువడగా.3 విభాగాల్లో కూడా భవానీ దుర్గ ప్రతిభ కనబరిచి ‘క్వీన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాగా’ ఎంపిక కావడం విశేషం.భవానీకు తండ్రి సత్యనారాయణ, తల్లి వరలక్ష్మిల ప్రోత్సాహం ఎంతో ఉందని, అందువలనే ఇది సాధ్యం అయిందని చెప్పింది.కాగా, ఈమె నగరంలోని ఆదిత్యా డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube