కొత్త వినియోగదారుల కోసం 30 రోజులు ఫ్రీ ట్రయిల్ ప్రకటించిన జియో ఫైబర్!

జియో టెలికాం సంస్థ సెప్టెంబరు 1వ తేదీ నుండి ఎవరైతే తమ ఫైబర్ కనెక్షన్ ను తీసుకుంటారో వారికి 30 రోజుల పాటు ఉచితంగా 150 ఎంబిపిఎస్ స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది.అయితే 30 రోజుల ట్రయిల్ పూర్తయిన తర్వాత జియో ఫైబర్ సేవలు ఇష్టమున్న వినియోగదారులు రూ.399 ప్లాన్స్ నుండి రూ.1,499 ప్లాన్ వరకు ఎంపిక చేసుకోవచ్చు.అలాగే గతంలో జియో కనెక్షన్ తీసుకున్న వారికి ప్రస్తుతం అప్గ్రేడ్ చేసిన బెనిఫిట్స్ అన్ని అందుబాటులోకి రానున్నాయి.సెప్టెంబర్ 1వ తేదీ నుండి తమ వినియోగదారులందరికీ అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ సమానంగా జియో ఫైబర్ అందించనుంది.

 Jio Fiber Announces 30 Days Free Trial For New Customers Jio, Jio Fiber, Free-TeluguStop.com

జియో ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వారికి ప్లాన్స్ ని బట్టి 12 ఓటీటీ యాప్‌ల వరకు ఉచిత సభ్యత్వం లభిస్తుంది.వాటిలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 కూడా ఉన్నాయి.

అత్యంత చౌకైన రూ.399తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు 30ఎంబిపిఎస్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందొచ్చు.రూ.699తో 100 ఎంబిపిఎస్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందొచ్చు. రూ .999 ప్లాన్ తో 11 ఓటిటి యాప్‌లకు ఉచిత సభ్యత్వం పొందడంతో పాటు 150 ఎంబిపిఎస్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందొచ్చు.ఇక చిట్టచివరి రూ.1,499 జియో ఫైబర్ ప్లాన్ లో 300 ఎంబిపిఎస్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 12 ఓటిటి ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సభ్యత్వం లభిస్తుంది.

అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి 10 ఓటిటి ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సభ్యత్వం లభించడంతోపాటు 150 ఎంబిపిఎస్ ట్రూలీ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, 4K సెట్-టాప్ బాక్స్‌తో మీరు జియో ఫైబర్ 30-రోజుల ఉచిత ట్రయల్ పొందవచ్చు.ట్రయల్ తర్వాత మీరు జియో ఫైబర్ సేవను ఇష్టపడకపోతే… పైసా కూడా చెల్లించకుండా జియో కంపెనీకి తిరిగి ఇచ్చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube