అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆడిషన్ కి వచ్చి డైరెక్టర్ కి ఫోటో ఇచ్చిన అనుష్క ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.
తీసిన ప్రతి సినిమాలో తన పాత్రకు ప్రత్యేకత ఉండేలా చూసుకొని నటించేది.ఏ పాత్ర అయినా సరే అందులో జీవించేస్తుంది.
అందుకే అనుష్కకు కొన్ని కోట్లమంది తెలుగువారు అభిమానులయ్యారు.
అలాంటి ఈ నటి ఒకప్పుడు దారుణంగా బాధ పడిందట.
దానికి కారణం సినిమాలో వేసుకోవాల్సిన పొట్టి బట్టలేనట.నిజానికి అనుష్క సినిమాల్లో కనిపించినట్టు కాదు.చాలా సైలెంట్, చాలా స్మార్ట్.ఎప్పుడు పద్దతిగా ఉండే అనుష్కకు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలి అని చెప్పేసరికి అనుష్క బాధపడిందట.ఆ సమయంలో వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్తే.నీకు ఇష్టం అయితే ఏదైనా చేయు.
ఇష్టం లేకుండా చెయ్యాల్సిన అవసరం లేదని చెప్పారట.
మొదట్లో అలాంటి పొట్టి బట్టలు వేసుకోవడానికి ఆలోచించిన అనుష్క సినిమాలు తీస్తూ తీస్తూ కొన్ని సినిమాలలో బికినీలు కూడా వేసింది.
అందుకు పాత్ర డిమాండ్ చెయ్యడం వల్లే అని అనుష్క కొన్ని సందర్భాల్లో తెలిపింది.బిల్లా సినిమాలో, వేదం సినిమాలో ఎలాంటి బట్టలు వేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.