సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు.పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆ తర్వాత మహేష్ బాబు చేయబోతున్న సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.రాజమౌళి దర్శకత్వంలో ఈయన సినిమా ఉండే అవకాశం ఉంది.
కాని అంతకు ముందు ఒక చిన్న సినిమాను ఈయన చేస్తాడని అంటున్నారు.సర్కారు వారి పాట తర్వాత ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని చిన్న బడ్జెట్లో చేయాలని మహేష్‌బాబు భావిస్తున్నాడు.
అందుకోసం యువ దర్శకులను ప్రోత్సహించాలని భావిస్తున్నారు.ఇప్పటికే కొంత మంది కథలు విన్న మహేష్ బాబు త్వరలోనే ఒక కథను ఫైనల్ చేసే అవకాశం ఉందట.వారం రోజుల క్రితం ఆన్ లైన్ ద్వారా ఒక యువ దర్శకుడు చెప్పిన కథ కు మహేష్‌బాబు బాగా ఫిదా అయ్యాడట.చిన్న బడ్జెట్ తో ఆ సినిమాను తాను చేయాలని అనుకుంటున్నాడట.
ఒక వేళ తాను చేయకున్నా తన బ్యానర్లో ఆ సినిమాను నిర్మిస్తానంటూ ఆ కొత్త దర్శకుడికి మాట ఇచ్చాడట.
మహేష్‌బాబు మాటతో పాటు అడ్వాన్స్ కూడా ఇవ్వడంతో ఆ కొత్త దర్శకుడు చాలా సంతోషంగా ఉన్నాడట.
వచ్చే ఏడాదిలో తన ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నాడు.మహేష్‌బాబు నిర్మాణ సంస్థలో వెబ్ సిరీస్‌లు కూడా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.ఆ ప్రొడక్షన్ టీంలో గత కొన్ని రోజులుగా ఆయన పని చేస్తున్నాడు.ఇప్పుడు ఏకంగా మహేష్‌బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చిందంటున్నారు.