వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే ఉంది.ఆ సందర్బంగా పలు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తాయంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది.కనుక ఎలాంటి అనుమానం లేకుండా ఆ సినిమా టీజర్‌ను దిల్‌రాజు విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక క్రిష్ దర్శకత్వంలో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఇదే సమయంలో మలయాళ మూవీ అయప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను పవన్ హీరోగా ప్రకటించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఇతర విషయాలను పక్కన పెడితే వకీల్ సాబ్‌కు సంబంధించిన బర్త్‌డే వీడియో ఏది రావడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసిన పార్ట్ నుండి ఎలాంటి ప్రోమోను కట్ చేయడానికి వీలు లేదని సినిమా గురించి ప్రేక్షకుల్లో ఆసక్తిని మెయింటెన్ చేయాలంటే వాటిని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా వారు చెబుతున్నారు.
అయితే సినిమా నుండి మరో పోస్టర్‌ను విడుదల చేయవచ్చు కదా అంటూ అభిమానులు కోరుతున్నారు.
పవన్ ఫ్యాన్స్‌కు వకీల్ సాబ్ ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ సక్సెస్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ఉంది.
దిల్‌రాజు సినిమా అంటే ఖచ్చితంగా కమర్షియల్ మూవీగా నిలుస్తుంది.ఇప్పటికే హిందీ మరియు తమిళంలో ఈ సినిమా ఆయా భాషల్లో రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది.
కనుక ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.