కరోనా వైరస్.ఎక్కడో చైనాలో పుట్టిన ఈ మహమ్మారి అతి తక్కువ సమయంలోనే ప్రపంచదేశాలకు పాకేసింది.ఈ క్రమంలోనే లక్షల మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది.అతిసూక్ష్మజీవి అయిన కరోనాను అడ్డుకోవడం.ప్రపంచదేశాలకు పెద్ద సవాల్‌గా మారింది.ఇక రోజులు తరబడి లాక్డౌన్ విధించినా కరోనా జోరు తగ్గలేదు.
కరోనా నుంచి రక్షించుకోవాలంటే.రోగనిరోధక శక్తి పెంచుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో కివీ పండు అద్భుతంగా సహాయపడుతుంది.చూడటానికి సపోట పండులా కనిపించే కివీ పండులో ఎన్నో పోషకాలు, విటమిన్లు దాగి ఉన్నాయి.
ఇవి శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు.కరోనా వంటి వైరస్ల నుంచి రక్షింస్తుంది.
ఇక గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి ఎన్నో భయంకర సమస్యలతో పోరాడే వారికి కూడా కివీ పండు గొప్ప ఔషధం అని చెప్పాలి.రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తినడం వల్ల.
ఇందులో ఉండే ఫోలేట్, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అలాగే ఇందులో ఉండే సి, ఇ విటమిన్లు చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి.
రక్తహీనత సమస్యతో బాధపడేవారు. కివీ పండ్లను డైట్లో చేర్చుకుంటే చాలా మంది.ఎందుకంటే.కివీ పండ్ల ద్వారా లభించే ఐరన్ రక్తహీనతను తగ్గించడంతో పాటు దంతాలు దృఢంగా చేస్తాయి.
కేన్సర్ రావడానికి కారణమయ్యే కారకాలతో పోరాడడంలోనూ కివీ పండు గ్రేట్‌గా సహాయపడతాయి.ఇక క్యాలరీలు, కొవ్వు తక్కువగా కివీ పండు షుగర్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది.
కాబట్టి, మధుమేహం సమస్యతో బాధపడేవారు కూడా కివీ పండు తీసుకోవడం మంచిది.