వావ్: అరుదైన నిలిగిరి పిల్లిని చూసారా..? ఎంత బాగుందో...!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వారధిగా చేసుకుని ఏ మూలన ఏ విషయం జరిగిన ప్రపంచానికి చేరవేస్తున్నారు చాలామంది.ముఖ్యంగా అరుదుగా ఉండే జంతువుల జాతికి సంబంధించిన వివరాలను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 Black Panther, Nilagiri Cat, Social Media, Matren Cat, Rare Animal, Viral-TeluguStop.com

ముఖ్యంగా మన దేశంలోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు అడవుల్లో నివసించే జంతువుల వివరాలను మన ముందుకు తీసుకువస్తున్నారు.ఇకపోతే నేడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి అయిన సుధా రామ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది.

ఇక ఈ వీడియోలో తానే స్వయంగా దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలో లభించే అత్యంత అరుదైన మాట్రెన్ జాతికి చెందిన నీలగిరి పిల్లిని చూసినట్లు చెప్పుకొచ్చారు.స్వయంగా ఆమె అందుకు సంబంధించిన వీడియోని తీసినట్లు తెలిపారు.

అయితే ఈ వీడియో కి ఆవిడ ‘ మీరు అనుకున్నట్లు ఇది బ్లాక్ పాంథర్ కాదని, అంతరించిపోతున్న జంతువులలో ఒకటిగా ఉన్న నీలగిరి పిల్లి ‘ అని తెలియజేసింది.కేవలం ఈ పిల్లులు భారతదేశంలోని పశ్చిమ కనుమలలో నివసించే అరుదైన జీవి అని తెలిపారు.

ప్రస్తుతం ఈ రకం జంతువులు అంతరించిపోయే దశలో ఉన్నట్లు ఆవిడ తెలిపారు.

ఇకపోతే ఈ పిల్లి చూడటానికి అచ్చం బ్లాక్ పాంథర్ లా ఉంటుందని, కాకపోతే… నీలగిరి పిల్లి మెడ కింది భాగం పసుపు, నలుపు రంగు కలిగి ఉంటుందని తెలిపారు.

అలాగే ఈ పిల్లి రెండు కేజీల పైగా బరువు ఉంటుందని అలాగే 40 నుండి 45 సెంటీమీటర్లు పొడవు కలిగి ఉంటుందని తెలిపారు.ఇకపోతే ఇంటర్నేషనల్ యునియర్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్టులో ఈ నీలగిరి పిల్లి పేరు కూడా ఒకటిగా చేర్చడం జరిగింది.

ఇకపోతే అరుదుగా కనబడే ఈ పిల్లి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube