వావ్: అరుదైన నిలిగిరి పిల్లిని చూసారా..? ఎంత బాగుందో…!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వారధిగా చేసుకుని ఏ మూలన ఏ విషయం జరిగిన ప్రపంచానికి చేరవేస్తున్నారు చాలామంది.

ముఖ్యంగా అరుదుగా ఉండే జంతువుల జాతికి సంబంధించిన వివరాలను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ముఖ్యంగా మన దేశంలోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు అడవుల్లో నివసించే జంతువుల వివరాలను మన ముందుకు తీసుకువస్తున్నారు.

ఇకపోతే నేడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి అయిన సుధా రామ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది.

ఇక ఈ వీడియోలో తానే స్వయంగా దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలో లభించే అత్యంత అరుదైన మాట్రెన్ జాతికి చెందిన నీలగిరి పిల్లిని చూసినట్లు చెప్పుకొచ్చారు.

స్వయంగా ఆమె అందుకు సంబంధించిన వీడియోని తీసినట్లు తెలిపారు.అయితే ఈ వీడియో కి ఆవిడ ' మీరు అనుకున్నట్లు ఇది బ్లాక్ పాంథర్ కాదని, అంతరించిపోతున్న జంతువులలో ఒకటిగా ఉన్న నీలగిరి పిల్లి ' అని తెలియజేసింది.

కేవలం ఈ పిల్లులు భారతదేశంలోని పశ్చిమ కనుమలలో నివసించే అరుదైన జీవి అని తెలిపారు.

ప్రస్తుతం ఈ రకం జంతువులు అంతరించిపోయే దశలో ఉన్నట్లు ఆవిడ తెలిపారు.ఇకపోతే ఈ పిల్లి చూడటానికి అచ్చం బ్లాక్ పాంథర్ లా ఉంటుందని, కాకపోతే.

నీలగిరి పిల్లి మెడ కింది భాగం పసుపు, నలుపు రంగు కలిగి ఉంటుందని తెలిపారు.

అలాగే ఈ పిల్లి రెండు కేజీల పైగా బరువు ఉంటుందని అలాగే 40 నుండి 45 సెంటీమీటర్లు పొడవు కలిగి ఉంటుందని తెలిపారు.

ఇకపోతే ఇంటర్నేషనల్ యునియర్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్టులో ఈ నీలగిరి పిల్లి పేరు కూడా ఒకటిగా చేర్చడం జరిగింది.

ఇకపోతే అరుదుగా కనబడే ఈ పిల్లి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఆరోగ్య సమస్య వల్ల బెయిల్ ఇవ్వాలంటున్న మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?