భారత చలనచిత్ర పరిశ్రమలో సాధారణంగా మన సినిమాలు కానీ, సీరియళ్లు కానీ పాకిస్థాన్ లో విడుదలయ్యేవి.కానీ మొదటిసారిగా పాకిస్థాన్ కు చెందిన ఓ వెబ్ సిరీస్ ను ఇండియాలో విడుదల చేయనున్నారు.
ఓటీటీలో విడుదలవుతున్న ఈ షో జీ ఎంటర్ టైన్ మెంట్ కు చెందిన జిందగీ ఛానెల్ లో సీరియళ్లు, వెబ్ సిరీస్ లు ప్రసారమవుతాయి.తాజాగా జిందగీ పాకిస్థాన్ లో ‘చురైల్స్’ అనే వెబ్ సిరీస్ ను ప్రారంభించింది.
ఈ వెబ్ సిరీస్ ను పాకిస్థాన్ దర్శకుడు అసీం అబ్బాసీ దర్శకత్వం వహించిగా నటీమణులు నిర్మాబుచా, మెహర్ బానో, సర్వాత్ గిలానీ, యాస్రా రజ్వీ నటించారు.
భారత్ లో ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11వ తేదీన జీ5లో విడుదల కానుంది.
నలుగురు మహిళలు ఓ డిటెక్టీవ్ ఏజెన్సీని ప్రారంభిస్తారు.ఇందులో భార్యలను మోసం చేస్తున్న భర్తలను పట్టుకునే నేపథ్యంలో కథ ముందుకు సాగుతుంది.
కాగా, ఈ డిటెక్టీవ్ ఏజెన్సీ కేవలం మోసపోతున్న భార్యలకే పరిమితం కాలేదు.లైగింక వేధింపులకు గురవుతున్న మహిళలు, బాలికలు, చిన్నారుల కేసుల పరిష్కరణ, ధనవంతులు మహిళలపై చూపే అహంకారాన్ని కూడా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.
అయితే, ‘చురైన్స్’లో ఎక్కువగా మహిళలను ఎలా కాపాడుతారనే కథాంశంపై ఈ స్టోరి రన్ అవుతుంది.మహిళల ఆంక్షలు, హక్కులు, నయవంచనలు, పురుషాధిక్యత, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై, హక్కుల పోరాటంపై ఈ వెబ్ సిరీస్ సాగుతుందని దర్శకుడు అసీం అబ్బాసీ వెల్లడించాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుందని, కచ్ఛితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.కాగా, దర్శకుడు అబ్బాసీ గతంలో రూపొందించిన కేక్ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయింది.