అప్పటి వరకు గ్లామర్ పాత్రలతో అదరగొట్టిన అనుష్కను ఒక్కసారిగా హీరో స్థాయి స్టార్‌డంకు పెంచిన చిత్రం అరుంధతి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం విడుదల అయ్యి 11 ఏళ్లు అవుతుంది.
అయినా ఇప్పటికి ఆ సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే ఆ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని దక్కించుకుందో అర్థం చేసుకోవచ్చు.రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది.
అప్పటి వరకు ఉన్న టెక్నాలజీతో అద్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ను తీర్చి దిద్దారు.
టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన అరుంధతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు చాలా సంవత్సరాల క్రితం ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకుంది.
కాని ఇప్పటి వరకు రీమేక్‌కు సంబంధించి ఎలాంటి కదలిక లేదు.ఎట్టకేలకు మళ్లీ బాలీవుడ్‌లో అరుంధతి చిత్రంకు సంబంధించిన రీమేక్ విషయమై చర్చ జరుగుతోంది.భారీ అంచనాల నడుమ ప్రముఖ అల్లు అరవింద్ మరియు మధు మంతెనలు ఈ సినిమాను ప్రముఖ హీరోయిన్‌తో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంది.ఇప్పటికే హిందీ డబ్బింగ్ వర్షన్ శాటిలైట్ ఛానెల్స్‌లో మరియు యూట్యూబ్‌లో ప్రసారం అయ్యాయి.కనుక ప్రేక్షకులు హిందీ అరుంధతి చిత్రంపై ఆసక్తిగా ఉన్నారు.
త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి వచ్చే ఏడాదిలో సినిమాను పట్టాలెక్కించి సినిమాను వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఈ నిర్మాతలు భావిస్తున్నారట.త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.