భారతదేశ ఆదాయపు పన్ను విభాగం( ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్) శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.ఆ ప్రకటనలో 2019-2020 ఆర్థిక సంవత్సరపు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువు నవంబర్ 30వ తేదీ వరకూ పెంచుతున్నట్టు పేర్కొంది.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాదు భారత దేశ వ్యాప్తంగా కూడా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్ల కే పరిమితమయ్యారు. పాఠశాలలు కాలేజీలు కూడా మూసివేయబడ్డాయి.
చాలా మంది ఇంటి నుండే పని చేస్తున్నారు.కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందోనని చాలామంది బయటకు వెళ్లలేని పరిస్థితి.
ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పన్ను చెల్లింపుదారులు కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతనే చెల్లించుకో వచ్చని… అందుకే నవంబర్ 30 తేదీ వరకు చెల్లింపు గడువును పెంచుతున్నట్టు ప్రకటించారు.
దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ పీడితుల రికవరీ సంఖ్య బాగా పెరిగిపోతుంది.ఈ గణాంకాలను బట్టి చూస్తే మూడు నాలుగు నెలల లోపు దేశంలో ఒకటి, రెండు కరోనా పాజిటివ్ కేసులు తప్ప ఎక్కువగా ఉండవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను కట్టేందుకు చెల్లింపుదారుల కొరకు జూలై 31 2020 వరకు గడువు పెంచినట్లు డైరెక్ట్ టాక్స్ సెంట్రల్ బోర్డ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.పాన్ కార్డు తో బయోమెట్రిక్ ఆధార్ కార్డు లింకింగ్ చేసుకునేందుకు మార్చి 2021 వరకు గడువును పెంచుతున్నట్లు డైరెక్ట్ టాక్స్ సెంట్రల్ బోర్డు ప్రకటించింది.