బ్రతికుండగానే కరోనాతో చంపేశారు అంటున్న బాలీవుడ్ నటి

కరోనా మహమ్మారి దేశంలో విపరీతంగా వ్యాపిస్తుంది.ఇక చిన్న, పెద్ద, పేద, ధనిక అని తేడా లేకుండా కరోనా వైరస్ అందరి మీద ఒకే విధంగా ప్రభావం చూపిస్తుంది.

 Tv Actress Jaya Bhattacharya Reacts To Death Hoax, Bollywood, Tollywood, Corona-TeluguStop.com

కొంత మంది సెలబ్రిటీలు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.అందులో కొంత మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు.

అయితే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైనా తర్వాత ఫేక్ న్యూస్ లు కూడా ఎక్కువగా వ్యాపిస్తున్నాయి.ఒకరి పేరుకి బదులు ఇంకొకరి పేరు, ఒకరి ఫోటో బదులు ఇంకొకరి ఫోటోలు షేర్ చేస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.

ఇలాంటి వాటి వలన కొంత మంది సెలబ్రిటీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.కొంత మందిని అకారణంగా చంపేసి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తూ ఉంటారు.

తరువాత వాటిపై సదరు నటులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇప్పుడు అలాంటి పరిస్థితి ఓ హిందీ నటికి వచ్చింది.

ప్రముఖ టీవీ నటి థప్‌కీ ప్యార్‌ కీ సీరియల్‌ ఫేం జయా భట్టాచార్యకు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది.ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి జయ మరణించారంటూ కొంతమంది నెటిజన్లు ఆమెకు నివాళులు అర్పించారు.

మహమ్మారి కారణంగా మరో గొప్ప నటిని కోల్పోయామంటూ సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె ఫొటోలను షేర్‌ చేశారు.ఇక ఈ విషయంపై స్పందించిన జయా భట్టాచార్య తాను బతికే ఉన్నానని ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.

ఆరోగ్యంగా ఉన్న తన గురించి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం తగదని, ఏదైనా పోస్టు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube