ఆరు నూరైనా వకీల్ సాబ్ వచ్చేది అప్పుడేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.

 Vakeel Saab To Release At Any Cost During Dussehra, Vakeel Saab, Pawan Kalyan, P-TeluguStop.com

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది.కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇక కొంతమేర షూటంగ్ మిగిలి ఉండటంతో ఈ సినిమాను త్వరలో పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమా షూటింగ్‌లో పవన్ ఇప్పట్లో పాల్గొనడని, దీంతో సినిమా షూటింగ్ మరింత ఆలస్యమై రిలీజ్ కూడా ఆలస్యం అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు.కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించి చాలా తక్కువ భాగమే షూటింగ్ మిగిలి ఉండటంతో, కేవలం కొద్ది సమయంలోనే ఈ షూటింగ్‌ను ముగించేసి దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటే దసరా నాటికి ఈ సినిమా రిలీజ్‌కు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరి ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube