తెలుగు వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న తమిళ హీరో

తమిళంలో చిన్న నటుడిగా పరిచయం అయిన విజయ్‌ సేతుపతి ప్రస్తుతం అక్కడ స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు.తెలుగులో కూడా ఈయన ఇప్పటికే సైరా చిత్రంతో పరిచయం అయ్యాడు.96 చిత్రంతో మరింత తెలుగు వారికి చేరువ అయ్యాడు.త్వరలో మెగా మూవీ ఉప్పెనతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 Vijay Sethupathi, Tamil Hero,mythri Movie Makers, Vijay Sethupathi Movie With My-TeluguStop.com

తెలుగులో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్‌ సేతుపతి హీరోగా ఒక సినిమాను అది తెలుగులో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విజయ్‌ సేతుపతితో మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఒక సినిమాను నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నారు.

ఆ సినిమా షూటింగ్‌ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది.

ఒక కొత్త దర్శకుడు ఈయన కోసం స్క్రిప్ట్‌ రెడీ చేశాడు.తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కించి అక్కడ ఇక్కడ ఒకేసారి విడుదల చేయాలనే ప్రయత్నాలు మైత్రి మూవీస్‌ వారు చెస్తున్నారు.

Telugu Mythri Makers, Tamil, Vijaysethupathi-

ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మాదిరిగా కాకుండా కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రంగా ఇది ఉంటుందని తెలుస్తోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉంది.మైత్రి మూవీ మేకర్స్‌ సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది.వారు మంచి కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తారనే నమ్మకం అందరిలో ఉంది.అందుకే ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube