తోలి దశ పరీక్షల్లో మంచి ఫలితాలు ఇస్తున్న వ్యాక్సిన్, త్వరలోనే కరోనా కు చెక్!

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ కరోనా మహమ్మారి కి ఎలాంటి మందు లేకపోవడం తో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో మరణాలు నమోదు అయిన సంగతి తెలిసిందే.చైనా లో పుట్టిన ఈ వైరస్ విషయం లో ఆ దేశం ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

 China Approves Third Covid-19 Vacchine For Clinical Trails , Coronaviru, Chaina-TeluguStop.com

ఈ కరోనా మహమ్మారి ని నియంత్రించడానికి చైనా కు చెందిన మూడు సంస్థలు వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. అయితే వీటిలో ఒక వ్యాక్సిన్ కరోనా మహమ్మారి పై పనిచేస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

సీనోఫార్మ్ నేతృత్వంలో మూడు దశల వయసు కలిగిన 96 మందిపై ట్రయల్స్ ను నిర్వహించనుంది. అయితే తొలిదశ ట్రయల్స్ ను ఇప్పటికే పరీక్షించగా మంచి ఫలితమే వచ్చినట్లు సమాచారం.

ఏప్రిల్ 23 వ తేదీన ట్రయల్స్ ను నిర్వహించారు.

ఈ ట్రయల్స్ వలన ఎలాంటి సైడ్ ఎఫక్ట్ రాలేదని, వ్యాక్సిన్ తీసుకున్నవాళ్ళు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదని వారు అంటున్నారు.

దీనితో ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇస్తుంది అన్న విషయం అర్ధం అవుతుంది.ఈ కరోనా మహమ్మారి కి ఇప్పటికే 1లక్షా 97 వేల మందికి పైగా మరణించగా 28 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినా విషయం తెలిసిందే.

ఈ మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవం తో అగ్రరాజ్యం అమెరికా సైతం చిగురుటాకులా వణికిపోతోంది.అయితే ఇప్పుడు చైనా లో తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తుండడం తో పాటు హనన్‌ ప్రావిన్స్‌లోని జియావోజౌ నగరంలో ర్యాండమ్‌, డబుల్‌ బ్లైండ్‌, ప్లాసిబో నియంత్రిత క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నామని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

అయితే మూడో దశ పూర్తై వ్యాక్సిన్‌ పనితనం, సామర్థ్యం తెలిసేందుకు కనీసం ఏడాది పడుతుందని అక్కడి శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మరి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ కావాలి అంటే మరో ఏడాది తప్పనిసరిగా ఆగాల్సిందే అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube