ఉప్పెనతో గుండె బరువెక్కడం ఖాయమట!

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తొలి చిత్రం ఉప్పెన షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.

 Uppena, Vaishnav Tej, Kriti Shetty, Sukumar-TeluguStop.com

ఇక ఈ సినిమాలోని ప్రేమకథ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా విఫలమైందనే అంశం చూస్తే ప్రేక్షకుల గుండె బరువెక్కుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

కాగా ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండనుందా అనే ఆసక్తి చిత్ర వర్గాల్లోనూ నెలకొంది.ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube