సిడ్ శ్రీరామ్, గొపి సుందర్, జిఏ2 పిక్చర్స్ మ్యూజికల్ మ్యాజిక్ ని రిపీట్ చేసిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” ఫస్ట్ సింగిల్ విడుదల
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఆడియో ఆల్బమ్ నుంచి మొదటి పాటను విడుదల చేశారు.గీత గొవిందం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం లో ఇంకేం… ఇంకేం….ఇంకేం…కావాలి….అనే సెన్సేషనల్ సాంగ్ ని అందించిన మ్యూజికల్ కాంబోని మళ్ళీ ఈ చిత్రం ద్వారా రిపీట్ చేశారు.“మనసా….మనసా… మనసారా… బ్రతిమాలా… తనవకవడిలో పడబొకే మనసా అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం సెన్సేషన్ గా ట్రెండ్ అవ్వడం విశేషం.ఇక బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ స్కిల్స్ తో పాటు….ఇండస్ట్రీకి వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందిస్తున్న ప్రొడక్షన్ హౌస్ గా పేరు సంపాదించిన జీఏ2 పిక్చర్స్ పతాకం పై తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాన్ని మెస్ట్ ఇంటిలిజెంట్ ప్రొడ్యూసర్ బన్నివాసు, వాసువర్మ తో కలిసి నిర్మిస్తున్నారు.
మనసా మనసా అంటూ మనసులు దోచుకున్న సిడ్ శ్రీరామ్, గొపిసుందర్
జీఏ 2 బ్యానర్ నుంచి గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గీతగోవిందం ఆడియో ఒక సంచలనమే అని చెప్పాలి.మ్యూజికల్ హిట్స్ కొంత గ్యాప్ వచ్చిన సమయంలో ఈ చిత్రం మ్యాజికల్ బ్లాక్ బస్టర్ కావటం విశేషం.మళ్ళి అదే కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమా ఆడియో కూడా అదే రేంజి విజయం సాధిస్తుందనే నమ్మకం అందరిలో వుంది.గోపీసుందర్ కంపోజ్ చేసిన ఈ ఆల్బమ్ లో సిడ్ శ్రీరామ్ పాడిన ఈ పాట మనసు దోచుకుంది.
ఈపాటని ఎన్నో మంచి పాటలకి సాహిత్యాన్ని అందించిన సురేందర్ కృష్ణ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు.
నటీ నటులు:– అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభయ్, అమిత్
.